టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం సమావేశమైన ఈ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో టీ అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ముందుగా నోటీసులు ఇవ్వాలని కమిటీ ఇవ్వాలని నిర్ణయించింది. సభ నియమాల ప్రకారమే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా మొదట అచ్చెన్నాయుడి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన కమిటీ... చీఫ్ విప్ సభలో తీర్మానం చేసిన ప్రకారం నిమ్మల రామానాయుడికి నోటీసులు ఇవ్వనుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన అనంతరం పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కమిటీ తెలపనుంది. ఇక గతంలో టీడీపీ ఇచ్చిన సభ హక్కుల నోటీసులపై కమిటీలో చర్చ జరగలేదు. సరైన ఫార్మాట్ లేని కారణంగా వీటిపై చర్చ జరపలేమని కమిటీ స్పష్టం చేసింది. ఇక ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే ఏడాది జనవరి 18 లేదా 19 తేదీల్లో తిరుపతిలో జరగనుంది. ఇదిలా ఉంటే ఈ కమిటీ సమావేశంలో అధికార, విపక్ష సభ్యులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం జగన్, మంత్రి కన్నబాబులపై టీడీపీ ఇచ్చిన నోటీసులపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే కమిటీ ఇందుకు అంగీకరించలేదు.
దీంతో టీడీపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. అచ్చెన్నపై స్పీకరే స్వయంగా రిఫర్ చేశారని వెల్లడించారు. ఇక రామానాయుడిపై సభలో తీర్మానం చేశామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ రామానాయుడు.. ఆయన వ్యవహారశైలిపై ప్రివిలేజ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పదే పదే సభలో అసత్యాలు చెబుతున్నారంటూ అధికార పార్టీ ఆయనపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తూ తీర్మానం చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:December 23, 2020, 13:13 IST