ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దిశ తండ్రి, ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టాన్ని అమలు తీసుకు వచ్చినందుకు అభినందించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి తక్షణమే దిశ చట్టం ద్వారా శిక్షలు పడాలని ఆమె తండ్రి ఆకాంక్షించారు. దిశ తరహా చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. ఎపి శాసనసభ శుక్రవారం దిశ యాక్ట్2019కి ఆమోద ముద్ర వేసింది. అలాగే గతంలో ర్యాగింగ్ బారిన పడి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషికేశ్వరి తల్లిదండ్రులు సైతం దిశ చట్టంను ప్రవేశపెట్టడంపై స్వాగతించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP disha act, Disha murder case