ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు... వారికి నో ఎంట్రీ..

ఏపీ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుంది.

news18-telugu
Updated: June 14, 2020, 7:07 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు... వారికి నో ఎంట్రీ..
ఏపీ అసెంబ్లీ భవనం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయంతీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి కరోనా బులెటిన్‌ను విడుదల చేశారు. అందులో కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుంది. సభ్యుల పర్సనల్ సెక్రటరీలు, పర్సనల్ అసిస్టెంట్‌లు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు లోనికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిన్న కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా ప్రతినిధులకు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు అనుమతి లేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, శాసనసభ, శాసనమండలిలో మీడియా గ్యాలరీకి మాత్రం ప్రతినిధులను అనుమతిస్తారు. అసెంబ్లీలో మీడియా అనుమతులకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి. అందులో మీడియా పాయింట్ వరకు మాత్రమే అనుమతి ఉండే పాస్ ఒకటి, మరొకరి ప్రెస్ గ్యాలరీతో పాటు శాసనసభ లాబీలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్యాలరీ వరకే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 14, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading