Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: May 18, 2019, 6:24 AM IST
లగడపాటి రాజగోపాల్ సర్వే (లోక్‌సభ) : టీడీపీకి 15, వైసీపీకి 10
Exit Polls 2019 : గంటలు గడుస్తు్ంటే ఎగ్జిట్ పోల్స్ కి టైమ్ దగ్గర పడుతున్నట్లే. జాతీయస్థాయిలో సర్వేల ఫలితాలు చెప్పడానికి దాదాపు డజన్ మీడియా, సర్వే సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సంస్థలు ఉన్నప్పటికీ... ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఎలా ఉండబోతోందన్నది అందర్లోనూ ఉన్న ఆసక్తే. కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్‌లో లేని ఆయన... తనకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారనీ, ఏ ఒక్క రాజకీయ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించట్లేదనీ చెబుతూ... ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు. పాలిటిక్స్‌కి దూరమైనా... ఇదివరకు చేయించిన సర్వేలు నిజమయ్యాయి. అంటే 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చెప్పినట్లుగానే దాదాపు దగ్గరగా వచ్చాయి ఫలితాలు. ఐతే... రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం లగడపాటి సర్వే పూర్తిగా తప్పైంది. ఆ ఎన్నికల్లో ప్రజాకూటమికే ప్రజలు పట్టం కట్టారనీ, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓటింగ్ శాతం పెరిగిందనీ చెప్పారు. తీరా చూస్తే, వాస్తవ ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
RG Flash Team : తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని తప్పుగా చెప్పి, తన క్రెడిబులిటీని దెబ్బతీసుకున్న లగడపాటి... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం అత్యంత జాగ్రత్తగా సర్వే చేయించారు. ఆర్జీ ఫ్లాష్ టీంగా పిలిచే... రాజగోపాల్ టీం... దాదాపు 5 సార్లు సర్వే చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ కసరత్తు జరిగేలా లగడపాటి తన టీంని ఆదేశించగా... ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రజల నాడిని పట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన ఫలితాలు తప్పైతే... ఇక ప్రజలు ఆ సర్వే రాయుణ్ని నమ్మరు. ఇదో పరువు-ప్రతిష్టల సమస్యగా మారడమే కాదు... వ్యక్తిగతంగా కూడా రాజగోపాల్‌కి ఇబ్బందికర పరిణామమే. తెలంగాణ ఎన్నికలపై ఫలితం తప్పుగా చెప్పడంతో... అప్పట్లో మంత్రి కేటీఆర్... లగడపాటి మధ్య మాటల తూటాలు పేలాయి. ఏపీ ఎన్నికలపై తప్పు చెబితే... లగడపాటికి అంతకంటే ఎక్కువ సమస్యలే తలెత్తే అవకాశాలు ఉండటంతో... క్షేత్రస్థాయిలో ఎక్కువ దృష్టి పెట్టి మరీ సర్వేలు చేయించినట్లు తెలిసింది.
టీడీపీ... వైసీపీ... హంగ్...? : ఏపీ ఎన్నికల సమయంలో... లగడపాటి... ఈసారి ప్రజలు అభివృద్ధినీ, సంక్షేమ పథకాల్ని చూసి ఓటేస్తున్నారనీ, అనుభవజ్ఞులకే పట్టం కట్టబోతున్నారని ఓ డైలాగ్ కొట్టారు. అందువల్ల ఈసారి అధికారం తమదేననే ధీమా వ్యక్తం చేసింది టీడీపీ. ఐతే... ఆ తర్వాత దాదాపు నెలపాటూ లగడపాటి సైలెంట్‌గా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం... చాలా ప్రైవేట్ సంస్థలు ఈసారి ఏపీలో వైసీపీ గెలవబోతోందని చెప్పడమే. ఈ పరిస్థితుల్లో లగడపాటి సర్వే ఎలా ఉండబోతోందన్నది అందర్నీ ఆలోచనలో పడేస్తోంది.
ఓవరాల్‌గా చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరూ అంచనా వెయ్యలేకపోతున్నారు. కొంతమంది హంగ్ వస్తుందని అంటున్నారు. మరి ఏపీ ప్రజల తీర్పు ఏంటన్నది మే 23న తెలుస్తుంది. ఈలోపు ట్రైలర్లాగా లగడపాటి సర్వేను మనం భావించవచ్చు. ఆదివారం సాయంత్రం 5 గంటల 1 సెకండ్‌కి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు రాబోతున్నాయి. లగడపాటి మాత్రం అలా గాబరా పడకుండా సాయంత్రం 6 తర్వాతే తన ఫలితాల్ని మీడియా ముందు వెల్లడిస్తారని తెలిసింది.
ఇవి కూడా చదవండి :
రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్... కరెక్టే చెబుతాయా..?ఆఫర్ ఇస్తాను... బెడ్రూంకి వస్తావా... టాలీవుడ్ సింగర్‌తో ఆ డైరెక్టర్...
First published:
May 18, 2019, 6:24 AM IST