Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: March 29, 2019, 7:12 PM IST
ప్రతీకాత్మక చిత్రం
(లక్ష్మీనారాయణ - కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
ఆంధ్రప్రదేశ్... ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. జిల్లాలోని కందుకూరులో నిన్న వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతల కంప్లైంట్‌తో ఇద్దరు వైసీపీ కార్యకర్తల్ని కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం వైసీపీ నేత షేక్ రఫీతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో వైసీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు కార్యకర్తలతో వెళ్లి ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... వైసీపీ నేత షేక్ రఫీని చంపేస్తామని బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు పోతుల ప్రసాద్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాంతో అరెస్టు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు తెలిపారు.
కందుకూరులో నిన్న సర్వే చేస్తున్న యువకులు రామబ్రహ్మం, చంద్రశేఖర్‌ని వైసీపీ నేత షేక్ రఫి, అతని అనుచరులు పట్టుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని RDO ఆఫీస్‌కి తీసుకెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోతుల ప్రతాప్ ఘటనా స్థలానికి వెళ్లి వైసీపీ నేత రఫీపై తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు భారీ సంఖ్యలో వెళ్లారు. రెండు వర్గాల వారూ కొట్టుకున్నారు. టీడీపీ నేతల కంప్లైంట్‌తో పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు.
ఆర్టికల్ 19, 21 కింద సర్వేలు చేయడం తప్పుకాదనీ.. అవగాహన లేక రాజకీయ పార్టీలకు చెందిన అసాంఘిక శక్తులు సర్వే బృందాల్ని నిర్భందించడం తప్పని ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారని భవిష్యత్తులో ఇవే పరిణామాలు ఎదురైతే... తాము తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. కందుకూరులో పోతుల రామారావు వర్సెస్ మానుగుంట మహీధర్ రెడ్డి కాస్తా వైసీపీ వర్సెస్ పోలీసుగా మారుతుందా..? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
జనసేనకు సీపీఐ గుడ్ బై చెప్పనుందా ? ఎక్కడ తేడా వచ్చింది?
కన్నా, రాయపాటి, శ్రీకృష్ణ... గుంటూరు... నరసారావుపేట ఎంపీ స్థానంలో గెలిచేదెవరు?PUBG : ఇండియాలో పబ్జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...
టీడీపీకి మరో ఎదురు దెబ్బ... వైసీపీలోకి మాజీ మంత్రి ?
Published by:
Krishna Kumar N
First published:
March 24, 2019, 1:30 PM IST