జగనే సీఎం..వైసీపీకి 110 సీట్లు ఖాయం...బీజేపీ జాతీయ నేత జోస్యం

ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాతే ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు ఎన్నో విధాలుగా ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని..ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదరని చెప్పారు.

news18-telugu
Updated: May 8, 2019, 5:04 PM IST
జగనే సీఎం..వైసీపీకి 110 సీట్లు ఖాయం...బీజేపీ జాతీయ నేత జోస్యం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో పోలింగ్ జరిగి దాదాపు నెల రోజులవుతోంది. అప్పటి నుంచీ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. విజయం తమదేనని వైసీపీ నేతల ధీమా వ్యక్తంచేశారు. అటు టీడీపీ సైతం తామే గెలుస్తామని చెబుతోంది. ఇక జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇలా నేతలంతా ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఏపీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయన్నారు మురళీధర్ రావు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాతే ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు ఎన్నో విధాలుగా ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని..ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదరని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న మురళీధర్ రావు... ఈ ఎన్నికలతో ఏపీలో టీడీపీ ప్రస్థానం ముగిసిపోయిందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు ముసుకుపోయాయని..తమ కూటమిలో టీడీపీ చేరే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

ap elections 2019, ap election results, ap assembly election survey, ap election latest survey, Muralidhar Rao, bjp leader Muralidhar Rao, ysrcp win,tdp, ys jagan, ysrcp, chandrababu naidu, ap politics, ap news, telugu news, ఏపీ ఎన్నికల సర్వే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు, టీడీపీ, వైసీపీ, బీజేపీ నేత మురళీధర్ రావు, మురళీధర్ రావు, ఏపీ ఎన్నికల ఫలితాలు, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, తెలుగు వార్తలు
మురళీధర్ రావు (File)


కేంద్రంలో బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని మురళీధర్ రావు ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి 300 సీట్లు వస్తాయని..తిరుగులేని మెజార్టీతో మోదీ మరోసారి ప్రధాని పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ...తమిళనాడులో తమ మిత్రపక్షం అన్నాడీఎంకేకు వచ్చే సీట్ల ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటామని చెప్పారు. కాగా, గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఏపీలో వైసీపీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు.
First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading