జగన్ సోదరి షర్మిలపై అసభ్య కామెంట్లు... యువకుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

AP Assembly Elections 2019 : టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలే తప్ప... తప్పు దారిలో వెళ్తే... తిప్పలు తప్పవని మరోసారి రుజువైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:57 PM IST
జగన్ సోదరి షర్మిలపై అసభ్య కామెంట్లు... యువకుణ్ని అరెస్టు చేసిన పోలీసులు
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మళ్లీ వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎంటరవుతున్నారు. జగన్ తరపున ఆమె కూడా ప్రచారం చేస్తున్నారు. జగన్ తల్లి విజయమ్మ కూడా త్వరలో ప్రచారం చెయ్యాలనుకుంటున్నారు. ఇదంతా చూసిన ఓ యువకుడు తట్టుకోలేకపోయాడు. జగన్ కుటుంబం మొత్తం ప్రచారంలో దిగితే... వైసీపీకి ఓట్లు ఎక్కువగా వచ్చేస్తాయనీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనీ ఎక్కడ లేని భయాలు పెంచుకున్నాడు. ఎలాగైనా జగన్‌ను అడ్డుకోవాలని కక్ష కట్టాడు. అందుకు షర్మిలను టార్గెట్ చేశాడు. పోలీసులు కనిపెట్టలేరులే అనుకుంటూ... షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ విషయం అలా అలా షర్మిల దాకా చేరింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్న ఆ కామెంట్లపై షర్మిల సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

హైదరాబాద్... రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు షర్మిల. వెంటనే రియాక్టైన పోలీసులు... అసభ్య కామెంట్లను పరిశీలించారు. అవి ఎక్కడి నుంచీ పోస్ట్ చేసిందీ పరిశీలించారు. మనం ఇంటర్నెట్‌లో ఏ పోస్ట్ చేసినా... దానికి ఇంటర్నెట్ ఐపీ అడ్రెస్ ఒకటి తెరవెనక ఉంటుంది. పోలీసులు ఆ ఐపీ అడ్రెస్ కనిపెట్టారు. తద్వారా ఏ కంప్యూటర్ లేదా మొబైల్ నుంచీ ఆ కామెంట్ల వీడియో పోస్ట్ చేసిందీ తెలుసుకున్నారు. ఇంకేముంది... అతనెవరో తెలిసిపోయింది. నిందితుణ్ని 39 ఏళ్ల హరీష్ చౌదరిగా గుర్తించిన పోలీసులు... అరెస్టు చేశారు.

చౌటుప్పల్‌ రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరీష్... ఇదివరకు హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో పనిచేశాడు. ఆ వివరాల ఆధారంగా చౌటుప్పల్‌లో అతన్ని అరెస్టు చేశారు. హరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు. ప్రస్తుతం చౌటుప్పల్‌ దగ్గర్లోని తంగెడిపల్లిలోని ఓ ఫార్మాసూటికల్‌ సంస్థలో పనిచేస్తున్నాడు.

రాజకీయ నేతల్ని విమర్శించడం తప్పు కాదు. అవి సద్విమర్శలై ఉండాలి. అంతే తప్ప... ఇలాంటి పనికిమాలిన కామెంట్లు రాస్తే... జైలే గతి అని మరోసారి గుర్తు చేస్తోంది ఈ కేసు.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో గెలిచేది టీడీపీ... చంద్రబాబు మళ్లీ సీఎం... ఓ పత్రిక కథనంఇది వ్యూహకర్తల కాలం... నేతలను నడిపిస్తున్నది వాళ్లే... దేశవ్యాప్తంగా 300 కన్సల్టెన్సీలు

AP Elections 2019: ఒకే పార్టీ..ఒకే టికెట్..ఒకే స్థానం..నామినేషన్‌ వేసిన ముగ్గురు అభ్యర్థులు

AP Elections: కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు
First published: March 26, 2019, 8:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading