రిటర్న్ గిఫ్టుకీ రూ.1000 కోట్లకీ సంబంధమేంటి... టీడీపీ నేతలు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే

AP Assembly Elections 2019 : ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో రూ.1000 కోట్లు అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సడెన్‌గా ఈ డబ్బు ప్రస్తావన ఎందుకొచ్చిందన్నది తేలాల్సిన ప్రశ్న.

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 12:04 PM IST
రిటర్న్ గిఫ్టుకీ రూ.1000 కోట్లకీ సంబంధమేంటి... టీడీపీ నేతలు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే
చంద్రబాబు, జగన్, కేసీఆర్
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటూ... ఆ పార్టీ నేతలు... ఇటీవల రూ.1000 కోట్లపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. రూ.1000 కోట్లకూ రిటర్న్ గిఫ్టుకూ లింకు పెట్టడంతో ఇదెలా అన్నదానిపై మాట్లాడుకుంటున్నారు. దీనిపై తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కూడా కామెంట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్‌లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రూ.1000 కోట్లు పంపించారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారు కచ్చితమైన ఆధారాలు ఉంటేనే చెయ్యాలన్నది వైసీపీ నేతల నుంచీ వస్తున్న సవాల్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు స్వయంగా ఈ ఆరోపణలు చేస్తుండటం ఎంతవరకూ సమంజసమన్న వాదన వినిపిస్తోంది వైసీపీ నేతల నుంచీ.

జగన్‌కు డబ్బు అవసరమా : వైసీపీ అధినేత జగన్... వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లక్ష కోట్లు దోచుకున్నారని టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. అది నిజమా, అబద్ధమా అన్నది పక్కన పెడితే... టీడీపీ నేతల మాటే నిజమని భావిస్తే... అంత డబ్బు ఉన్న వ్యక్తికి కేసీఆర్ రూ.1000 కోట్లు పంపాల్సిన అవసరం ఏముంటుందన్నది మరో ప్రశ్న. నిజంగానే కేసీఆర్ పంపారనుకుంటే, జగన్ ఆ డబ్బుపై ఆధారపడ్డారనుకుంటే... ఆయన దగ్గర లక్ష కోట్లు లేనట్లే అనుకోవాలా అన్నది మరో తేలాల్సిన అంశం.

రిటర్న్ గిఫ్ట్‌కీ డబ్బుకీ సంబంధమేంటి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీడీపీ పోటీ చెయ్యడాన్ని నిరసిస్తూ కేసీఆర్... ఏపీలో చంద్రబాబుకు తెలిసొచ్చేలా చేస్తామంటూ... అందులో భాగంగా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కామెంట్ చేశారు. అంటే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నది చంద్రబాబుకే గానీ... జగన్‌కి కాదు. ఇంకా చెప్పాలంటే అది గిఫ్టే కాదు. అదో ఇబ్బందికర పరిస్థితి. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే... తాము ఎలాంటి ఇబ్బందులు పడ్డామో... ఏపీలోనూ టీడీపీకి అలాంటి ఇబ్బందికర వాతావరణం కల్పిస్తామన్నది రిటర్న్ గిఫ్ట్ సారాంశం. ఇందులో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు.

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ప్రకటన చేసినప్పుడు... టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయబోతోందా, వైసీపీ తరపున ప్రచారం చేయబోతోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే... ఏపీలోకి టీఆర్ఎస్ ఎంటరైతే... ఆంధ్రా సెంటిమెంట్ రగిలి... అది టీడీపీకి కలిసొస్తుందనే సంకేతాలు రావడంతో... టీఆర్ఎస్ ఆ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో... వైసీపీ తరపున ప్రచారానికి బదులు... కేసీఆర్... డబ్బు సాయం చేస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. రాజకీయ ఆరోపణలకు ఆధారాలు దొరకవన్నది కొందరు టీడీపీ నేతల మాట.
ఎన్నికల కోడ్ ప్రకారమైతే... ఏ పార్టీ నేతలైనా సరే... ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యకూడదు. అలాంటి ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టకూడదు. అందువల్ల ఈ వెయ్యి కోట్ల రూపాయలపై టీడీపీ నేతలు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇందుకు టీడీపీ సిద్ధంగా లేకపోవడంతో... ఈ ఆరోపణలలో నిజానిజాలెంత అన్నది తేలే అవకాశాలు కనిపించట్లేదు. సో... ప్రజలే ఆలోచించి, ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాయి ఏపీలో రాజకీయ పార్టీలు.

 

ఇవి కూడా చదవండి :ఏపీ తర్వాత బీహార్‌పై దృష్టిపెట్టిన నరేంద్ర మోదీ... నితీశ్‌ కుమార్‌తో పొత్తు కలిసొస్తుందా?

మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మొత్తం ఆస్తుల చిట్టా ఇదీ... ఐదేళ్లలో ఎంత పెరిగాయంటే...

భారత్ మిషన్ శక్తి ప్రయోగం ప్రమాదకరం... స్పేస్ వ్యర్థాలతో వ్యోమగాములకు ఇబ్బందే... నాసా ప్రకటన

హ్యాట్రిక్ కొట్టిన టీంఇండియా... టెస్టుల్లో మళ్లీ ఛాంపియన్లుగా కోహ్లీ సేన
First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading