జనసేన మేనిఫెస్టో: రైతులకు పింఛన్, విద్యార్థులకు ల్యాప్‌టాప్, మహిళలకు సిలిండర్..

రైతులకు రూ.5వేల ఫించన్, ఎకరాకు రూ.8 సాయం, కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా, కేజీ టు పీజీ ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు, ఉచిత క్యాంటిన్లు, ఉచిత ల్యాప్‌టాప్‌లు, మహిళలకు ఉచిత సిలిండర్ సహా ఎన్నో పథకాలను ప్రకటించారు.

news18-telugu
Updated: March 14, 2019, 9:11 PM IST
జనసేన మేనిఫెస్టో: రైతులకు పింఛన్, విద్యార్థులకు ల్యాప్‌టాప్, మహిళలకు సిలిండర్..
పవన్ కల్యాణ్(File)
  • Share this:
ఎన్నికల వేళ ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. మహిళలు, రైతులు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మెనిఫెస్టోలు రూపొందిచాయి పార్టీలు. ఏపీ మొదట జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.  రైతులకు రూ.5వేల ఫించన్, ఎకరాకు రూ.8 సాయం, కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా, కేజీ టు పీజీ ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు, ఉచిత క్యాంటిన్లు, ఉచిత ల్యాప్‌టాప్‌లు, మహిళలకు ఉచిత సిలిండర్ సహా ఎన్నో పథకాలను ప్రకటించారు. జననసేన పూర్తి మేనిఫెస్టో ఇక్కడ చూడండి.జనసేన మేనిఫెస్టో:

వ్యవసాయం
1. రైతు రక్షణ భరోసా: 60 సం. వయస్సు పైబడిన సన్నకారు, చిన్నకారు మరియు కౌలుదారులకు నెలకు రూ. 5000 పెన్షను.
2. రైతే రాజు: రైతులను సంపన్నులను చేయుటకు ప్రభుత్వ సహాయంతో అవకాశ జోన్ల ఏర్పాటు చేసి వాటిలో రైతులను భాగస్వాములను చేయడం.
3. ఉభయ గోదావరి జిల్లాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి, ఆహార ధాన్యాల మరియు పండ్ల, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి మండలం లోను గిడ్డంగులు, శీతలీకరణ నిల్వ యూనిట్లు, వ్యవసాయ ఆహార తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడును.
4. రైతులకు ఉచిత సోలార్ పంప్ సెట్స్.5. ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు త్రాగునీటి సదుపాయం కొరకు వెలుగొండ  ప్రాజె క్టులు నిర్మించబడును. రాయలసీమను సౌభాగ్యవంతం చేయుటకు అధునాతన వ్యవసాయక పద్ధతులను ప్రవేశపెట్టుట. మరియు ఉత్తరాంధ్రను సుభిక్షంగా తయారు చేయుటకు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లు నిర్మించుట.

విద్య:
6. ఒకటవ తరగతి నుండి పీజీ కోర్సు వరకు ఉచిత విద్య, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించబడును మరియు ప్రభుత్వ కళాశాలలలొ విద్యార్థులకు ఉచిత క్యాంటిన్లు ఏర్పాటు చేయబడును మరియు జూనియర్ కళాశాల స్థాయి నుండీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్.
7. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ, వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయబడును.
8. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫీజు వసూలు మరియు అన్ని సామాజిక వర్గాల విద్యార్థినీ, విద్యార్థులకు సర్వ సమత్వ వసతి గృహాలు ఏర్పాటు చేయబడును.
9. అన్ని వృత్తి పర కళాశాలల్లో ఇన్నోవేషన్ హబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు.

ఆరోగ్యం
10. బడ్జెట్ పెంపు మరియు రూ. 10,00,000 వరకు అందరికి ఉచిత ఆరోగ్య భీమా కల్పించబడును. దశల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ౩౦ పడకల ఆస్పత్రులుగా మార్చబడును. ప్రతి మండలానికి  సంచార వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయబడును.

ఉద్యోగం-ఉపాధి
11. APPSC క్యాలెండర్ అమలు చేయబడును, ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ మరియు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన ఆరునెలల్లో భర్తీ చేయబడును.
12. రూ. 10000 కోట్ల రూపాయల నిధితో నూతన పారిశ్రామిక వేత్తలకు సహాయం కొరకు వెంచర్ కాపిటల్ ఫండ్. ప్రతి సంవత్సరం యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించబడును.
13. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక సదుపాయం చేయబడును. విదేశీ పెట్టుబడులతో ప్రతి పరిశ్రమకు తగిన స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయబడును.

మహిళలు
14. మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో ౩౩% రిజర్వేషన్ కల్పించబడును. మరియు పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు కల్పించబడును.
15. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, ప్రతి సంక్రాంతికి ఆడపడుచులకు చీరల పంపిణి మరియు రేషన్ కి బదులుగా మహిళల ఖాతాల్లో రూ. 2500 నుండి 3500 వరకు నగదు జమ.
16. ప్రతి జిల్లాలో ఒక మహిళా బ్యాంకు స్థాపన మరియు ప్రతి జిల్లాకి మహిళా ఆరోగ్య స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.
17. ప్రతి మండలానికి ఒక కల్యాణ మండపం నిర్మాణం. మహిళా ఉద్యోగినుల సౌకర్యార్ధం డేకేర్ సెంటర్ల ఏర్పాటు, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ఏర్పాటు చేయబడును.

అభివృద్ధి
18. అవకాశాన్ని బట్టి బీసీ లకు 5% రిజర్వేషన్లు మరియు రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడును.
19. కాపులకు 9 వ షెడ్యూలు ద్వారా రిజర్వేషన్లు కల్పించబడును.
20. SC వర్గీకరణకు సామరస్య పరిష్కారం.
21. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ సిఫారసులను అమలు చేయబడును.

వృద్ధులు:
22. ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానం రద్దు.
23. వృద్ధులను ఆదుకొనుటకు ప్రభుత్వ వృద్ధాశ్రమములను ప్రతి మండలంలోనూ నడుపబడును.
WELFARE
24. ప్రభుత్వ సంస్థలలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయబడును.
25. అర్ధరూపాయి వడ్డీతో బంగారు నగల తాకట్టు రుణాలు మంజూరు చేయబడును, ఆ రుణాన్ని ఒక సంవత్సరం లోపు అసలు + వడ్డీతో కలిపి చెల్లించే వారికి వడ్డీని పావలా వడ్డీగా తగ్గించబడును.
26. చిరు వ్యాపారులకు ఏవిధమయిన పూచి లేకుండా రూ. 5000 వరకు పావలా వడ్డీ రుణ సదుపాయం చేయబడును.
27. బహుళ అంతస్థుల అపార్టుమెంటులను నిర్మించి ప్రతి కుటుంబానికి గృహాన్ని ఉచితంగా ఇవ్వబడును.

మత్స్యకారులు
28. మత్స్యశాఖ, మత్స్యాభివృద్ధి బ్యాంక్  స్థాపన, పశు సంవర్ధన, పాడి పరిశ్రమాభివుద్ది, మత్స్య పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడును. మత్స్యకారుల సంక్షేమం మరియు మత్స్య పరిశ్రమాభివృద్ధి తోడ్పాటు కల్పించబడును.
29. ౩౦౦ రోజుల ఉపాధి కల్పన, వేట నిషేధం మరియు తుఫానుల హెచ్చరిక సమయంలో చేపల వేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ. 500 ఆర్ధిక సదుపాయం కల్పించబడును. అన్ని మత్స్యకారుల గ్రామాలకు రెండు సం. లోపు సురక్షిత మంచి నీటి సరఫరా చేయబడును.  జెట్టీలు, హార్బర్లను నిర్మించి పర్యాటక ప్రోత్సాహం ద్వారా వేల సంఖ్య లో ఉద్యోగావకాశాలు కల్పించుట.

రెల్లి సామాజికవర్గం
30. రెల్లి యువత స్వయం ఉపాధి కొరకు రూ. 50000 వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించబడును.
31. రెల్లి కార్మికులకు ఆటో రిక్షా కొనుగోలు కొరకు 50% సబ్సిడీ పే రుణ సదుపాయం. మరియు ప్రైవేటు సంస్థలలో పని చేయుచున్న రెల్లి వనితలకు ఉచిత స్కూటరు. ఉచిత గృహ సదుపాయం.

స్థానిక పరిపాలన
32. గ్రామీణాభివృద్ధికి డా అబ్దుల్ కలం ఆశయమైన పుర స్కీమ్స్ అమలు చేయబడును. గ్రామాలు అన్నింటిలో నగర వసతులు కల్పించబడును.  ప్రతి 5 సం. కు స్థానిక సంస్థ లకు ఎన్నికలు మరియు 73 , 74 రాజ్యాంగ సవరణల అమలు.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading