ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లియర్ మెజార్టీ సాధించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు 88 కంటే ఎక్కువగా 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చూస్తుంటే వైసీపీ దూకుడు ముందు టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు మొదటి రెండు రౌండ్లకే క్లియర్ గా అర్థమైపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏపీలో కరెక్ట్ అయ్యాయని, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం ఖాయమని అంటున్నారు.
లగడపాటి రాజగోపాల్ సర్వే మరోసారి తప్పైంది. ఇదివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా సర్వే ఇచ్చిన లగడపాటి, ఏపీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తీరా చూస్తే... వైసీపీకి క్లియర్ మెజార్టీ ఆధిక్యం కనిపిస్తోంది. అందువల్ల ఇక లగడపాటి దుకాణం సర్దుకోవడం బెటర్ అంటున్నారు వైసీపీ అభ్యర్థులు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.