చంద్రగిరిలో గొడవలు... టీడీపీ, వైసీపీ మధ్య రభస...

AP Assembly Election Results 2019 : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో... టీడీపీ, వైసీపీ ఏజెంట్లు బాహాబాహీకి దిగారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 8:31 AM IST
చంద్రగిరిలో గొడవలు... టీడీపీ, వైసీపీ మధ్య రభస...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 8:31 AM IST
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో... ప్రారంభ కౌంటింగ్ ప్రశాంతంగా మొదలవ్వలేదు. టీడీపీ, వైసీపీ ఏజెంట్లు బాహాబాహీకి దిగారు. మీరు ఓవరాక్షన్ చేస్తున్నారంటే, మీరు చేస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శించారు. మీ వల్లే రీపోలింగ్ జరిగిందని టీడీపీ మద్దతుదారులు అనగా... కాదు మీ వల్లే హింస జరిగిందని వైసీపీ మద్దతు దారులు మండిపడ్డారు. దాంతో కౌంటింగ్ నిర్వహణకు ఇబ్బంది కలుగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులూ ప్రయత్నిస్తున్నారు. ఏదైతే జరగకూడదని అటు టీడీపీ, ఇటు వైసీపీ అధినేతలు కోరుకున్నారో, అందుకు విరుద్ధంగా చంద్రగిరిలో జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...