ఓమైగాడ్... ఏపీ సచివాలయంలో ఫైల్స్ ధ్వంసం... ఏదో జరుగుతోంది...

AP Assembly Election Results 2019 : వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలిపోవడంతో... సెక్రటేరియట్‌లో ఫైల్స్ మాయం చేస్తున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 2:51 PM IST
ఓమైగాడ్... ఏపీ సచివాలయంలో ఫైల్స్ ధ్వంసం... ఏదో జరుగుతోంది...
ఏపీ తాత్కాలిక సచివాలయం (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో భద్రతను కట్టుదిట్టం చెయ్యాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఎం ఆఫీస్ సహా... సెక్రటేరియన్ నుంచీ ఎలాంటి ఫైల్సూ బయటకు తరలించకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఐతే... ఇప్పటికే ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సహా... కొన్ని శాఖల్లో కీలక ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వం తిరిగి రాకపోవడమేనని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్ని బయటకు తీసి... దర్యాప్తులు జరిపిస్తుందనే సంకేతాలు రావడంతో... ముందుగానే జాగ్రత్త పడుతున్న అధికారులు... తాము ఇరుక్కోకుండా ఉండేందుకు అక్రమాల ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారని తెలుస్తోంది. ఐతే... సచివాలయ సిబ్బంది ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితి.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అమలవుతోంది. హోంశాఖ ఆదేశాలతో జగన్‌కి ఏపీ పోలీస్ శాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. అలాగే ఆయన ఇంటి దగ్గర భద్రతను మరింత పెంచింది. ఒక్కసారిగా ఆ ఇంటికి వైసీపీ నేతల రాకపోకలు పెరిగాయి. రెండ్రోజులుగా అక్కడ పూర్తి బిజీ వాతావరణం కనిపిస్తోంది. అందువల్ల పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై అక్కడికి వచ్చే వీఐపీలకు అదనపు భద్రత కల్పిస్తోంది. ఇంటి చుట్టూ ప్రత్యేక సెక్యూరిటీ వలయంగా సిబ్బందిని నియమించింది.

జగన్‌కి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటూ... జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఈ నెల 21న కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అవి అమలయ్యాయి. ఐతే, వాటిపై ఎక్కడా ప్రచారం చెయ్యకుండా పోలీస్ శాఖ సైలెంట్‌గా ఉంది. వైఎస్ జగన్‌కి ప్రత్యర్థులు ఎక్కువే. అందువల్ల ఎందుకైనా మంచిదని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఇవి కూడా చదవండి :

లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సన్నీలియోన్... ఎలాగంటే...

ఇక నవరత్నాలు, మేనిఫెస్టో అమలుపై వైసీపీ దృష్టి... రైతులకు అధిక ప్రాధాన్యం...రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...

లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>