కే ఏ పాల్‌కి 281 ఓట్లు... డిపాజిట్ కూడా రాలేదే...

కే ఏ పాల్ (File)

AP Assembly Election Results 2019 : అది చేస్తా, ఇది చేస్తా... దుమ్మురేపుతా అంటూ హడావుడి చేసిన కే ఏ పాల్ చివరకు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

  • Share this:
KA Paul : ఏపీలో ఓవైపు టీడీపీ, వైసీపీ మధ్యలో జనసేన పొలిటికల్ వార్ జరుగుతుంటే, అసలీ పార్టీలన్నీ వేస్ట్ అంటూ... సడెన్‌గా కొత్త పార్టీతో కలకలం రేపారు కే ఏ పాల్. ఆయన మాటలు, చేష్టలు అన్నీ నెటిజన్లకు బాగా నచ్చాయి. ఆయన పెట్టే ట్వీట్లకు పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయి. దాంతో తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని అనుకున్న పాల్... దుమ్మురేపుతామన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది తామే అన్నారు. ఇలా దాదాపు రెండు నెలలపాటూ హడావుడి చేసిన పాల్... ఇటీవల తన ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు కచ్చితంగా వస్తాయన్నారు. కానీ వాస్తవం పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు మాగ్జిమం 300 ఓట్లకు మించి రాలేదు. ఎవరుదాకో ఎందుకు... స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా... నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పాల్‌ కి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేయగా... 2,987 ఓట్లు వచ్చాయి. అంటే ప్రజలు ఆయన్ని ఓ కమెడియన్‌గా చూస్తున్నారే తప్ప... రాజకీయ నేతలా చూడలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రజాశాంతి పార్టీకి ఆ కొన్ని ఓట్లు కూడా వచ్చేవి కావనీ, ఆయన పార్టీ గుర్తైన హెలికాప్టర్... తమ పార్టీ గుర్తైన ఫ్యానును పోలి ఉన్నందువల్ల... ఫ్యానుకి ఓటు వెయ్యాలనుకున్నవారు పొరపాటు పడి... హెలికాప్టర్‌కి వేసి ఉంటారని అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఫ్యాను గాలికి కొట్టుకుపోయిన ఈ పార్టీ... ఇక తెరమరుగైనట్లే అంటున్నారు వైసీపీ అభిమానులు.

పాల్ వాదన ఇదీ : వైసీపీ వాదనతో పాల్ ఏకీభవించట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనీ, హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే... అది వైసీపీ ఫ్యాన్ గుర్తుకు పడిందని ఆరోపించారు. అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమైందన్నారు కేఏ పాల్.

 

ఇవి కూడా చదవండి :

యువతిపై రేప్... ఇల్లు అద్దెకు కావాలని వచ్చి...

 

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్... కేసీఆర్‌కి మోదీ రిటర్న్ గిఫ్ట్...

ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?

వైసీపీలోకి ఉండవల్లి... రావడమే లేటు...

 
First published: