ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...

AP Assembly Election Results 2019 : ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు ఓట్ల లెక్కింపు ఏకంగా 33 రౌండ్లు ఉండటంతో చాలా ఆలస్యం కాబోతోంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, ఆలూరు, పెనమలూరు, గన్నవరంలలో 30 రౌండ్లకుపైగా ఓట్ల లెక్కింపు ఉంది. సువిధ యాప్‌తోపాటు దేశవ్యాప్తంగా ఫలితాల్ని తెలుసుకునేందుకు ఈసీ ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటుచేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 7:43 AM IST
ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
AP Election Results 2019 : ఓట్ల లెక్కింపులో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు అయిపోతుంది. చివరి ఫలితం రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం నుంచీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త్వరగా ఫలితాలు వచ్చే స్థానాలు : కొవ్వూరు, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు, గుంటూరు తూర్పు, నెల్లూరు రూరల్, ప్రత్తిపాడు,, నగరి, అనపర్తి, పార్వతీపురం, మాడుగుల, విశాఖపట్నం దక్షిణం, విశాఖ పశ్చిమం, వేమూరు

ఆలస్యంగా ఫలితాలు వచ్చే స్థానాలు : జగ్గంపేట, అమలాపురం, పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం అర్బన్, తుని, పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ.

కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

సాధారణంగా కౌంటింగ్‌ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్‌ హాళ్లను బట్టీ టేబుళ్ల సంఖ్యను పెంచుకోవచ్చని ఈసీ తెలిపింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లున్నాయి. అందువల్ల ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వస్తాయి. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లున్నాయి. అక్కడ కూడా ఫలితాలు వేగంగా వస్తాయి. కృష్ణా జిల్లా నందిగామలో అతి తక్కువగా 7 టేబుళ్లే ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు అవుతుంది.

ఎన్నికల సరళి, ఫలితాలను చెప్పడానికి ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాల్ని కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మైక్‌లో చెబుతారు. అలాగే మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్‌ చేయబోతున్నారు.

దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. https:// results. eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్‌ హెల్ప్‌ లైన్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. అందువల్ల కచ్చితమైన ఫలితాలు కావాలనుకున్నవారికి ఇవి చక్కగా ఉపయోగపడనున్నాయి. ఈ ఫలితాలు అధికారికమైనవి కాబట్టి... ఇవి అయోమయానికి తెరదించుతాయి.ఇవి కూడా చదవండి :

ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...

ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

EVMలపై కంప్లైంట్లకు కంట్రోల్ రూం... ఇలా ఫిర్యాదు చెయ్యండి...

లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...
Published by: Krishna Kumar N
First published: May 23, 2019, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading