ఏపీపైనే అందరి చూపు... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు...

AP Assembly Election Results 2019 : దేశవ్యాప్తంగా మళ్లీ బీజేపీ నేతృత్వంలో NDA ప్రభుత్వం వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడంతో... లోక్ సభ ఎన్నికల కంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కువ మందికి ఆసక్తి కనిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 6:15 AM IST
ఏపీపైనే అందరి చూపు... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 6:15 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల ఎన్నికలకు పోలింగ్ జరిగిన 42 రోజుల తర్వాత... ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. మూడు ఎగ్జిట్ పోల్స్ టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పగా... 10 ఎగ్జిట్ పోల్స్... వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. ఐతే... టీడీపీ గెలుస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పడంతో... ఆ పార్టీ వర్గాలు ఒకింత ధైర్యంగా ఉన్నాయి. ఏప్రిల్‌ 11న తొలి దశలో ఎన్నికలు జరిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఫలితాల కోసం మనం వేచిచూడాల్సి వచ్చింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 25 ఎంపీ స్థానాలకు 319 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు వేటికవే పోటీ చేసినా... ఈ మూడు పార్టీల మధ్యా అనధికారిక ఒప్పందం ఉందని వైసీపీ ఆరోపించింది. ఐతే... వైసీపీకి బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇలా ఆరోపణలతో 42 రోజులూ గడిచిపోయాయి. ఇవాళ మధ్యాహ్నం 12 కల్లా ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మంది ఆధిక్యంలో ఉన్నారో తెలుస్తుంది. తద్వారా ఆ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని మనం అంచనాకు రావచ్చు.

తెలంగాణతోపాటు ఏపీ ఫలితాలపై తెలుగు ప్రజల్లో ఆసక్తి బాగా ఉంది. ఓట్ల లెక్కింపులో భాగంగా... పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్ల లోనే ఓట్లలెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండు పూర్తి చేయాల్సి ఉన్నందువల్ల ఫలితంగా కాస్త లేటుగా వస్తుంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమ లూరు, గన్నవరం, నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రైండ్లకు పైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ మనకు మధ్యాహ్నం కల్లా పిక్చర్ వచ్చేస్తుంది కాబట్టి... తుది ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం ఉండదంటున్నారు విశ్లేషకులు.

 ఇవి కూడా చదవండి :

ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...
Loading...
ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

EVMలపై కంప్లైంట్లకు కంట్రోల్ రూం... ఇలా ఫిర్యాదు చెయ్యండి...

లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...