టీడీపీ ఎన్నికల ఏజెంట్లకు ఆదేశాలు... చంద్రబాబు ఏమన్నారంటే...

AP Assembly Election Results 2019 : ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ చంద్రబాబు చివరిసారిగా శ్రేణులకు, పార్టీ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. అలా చేస్తే, టీడీపీ గెలుస్తుందన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 7:37 AM IST
టీడీపీ ఎన్నికల ఏజెంట్లకు ఆదేశాలు... చంద్రబాబు ఏమన్నారంటే...
చంద్రబాబు
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 7:37 AM IST
దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుండగా... టీడీపీ తరపున కౌంటింగ్ ఏజంట్లుగా ఉన్నవారు ఏం చెయ్యాలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు. ఇది కీలక సమయం అన్న చంద్రబాబు... ఏజెంట్లు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని కోరారు. ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌లో ఏజెంట్లు, పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు, ఇదే విషయాన్ని తాను ముందు నుంచే చెబుతున్నాననీ, అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీ ఏదో ఒకటి చేసి, ఎన్నికల ఫలితాల్ని గందరగోళం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కౌంటింగ్ చివరి క్షణం వరకూ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలనీ, ఏమాత్రం పక్కకు వెళ్లినా కొంపలు మునుగుతాయని పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో విజయం దూరమయ్యే పరిస్థితి కూడా రావచ్చని అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడినా.. ఆవేశానికి లోనుకాకుండా టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదనీ, అందరి శ్రమ, కార్యకర్తల పట్టుదల, కృషితో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చంద్రబాబు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఇతర వైసీపీ అనుకూల సర్వేలను పట్టించుకోవద్దన్న చంద్రబాబు... మౌనంగా ఉండటం ద్వారా... చక్కటి విజయాన్ని సాధిస్తామని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :ఇక సంబరాలే... టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు...

మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...

ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...