జగన్‌ను కలిసిన ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఏమన్నారంటే...

AP Assembly Election Results 2019 : ఏపీలో కొత్త ప్రభుత్వానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం అన్నీ చూసుకుంటున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ పనుల సంగతి చూస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 3:51 PM IST
జగన్‌ను కలిసిన ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఏమన్నారంటే...
ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత... మిగతా 6 దశలు జరగాల్సిన సమయంలో... ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో... ఏపీ పరిపాలనా వ్యవహారాల్ని తన నెత్తిన వేసుకున్నారు ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం. దీనిపై చంద్రబాబు నానా యాగీ చేశారు. తాను సీఎంననీ తన మాట అందరూ వినాలనీ, తనకు చెప్పకుండా సీఎస్ ఎలాంటి సమీక్షలూ జరపరాదనీ గగ్గోలు పెట్టారు. ఐతే... ఉన్నతాధికారులు సైతం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ పంతం పట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు తామెందుకు నేతల మాట వినాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షా సమావేశం పెట్టినప్పుడు సీఎస్ సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. ఇలా సీఎస్‌తో చంద్రబాబు అనేక అంశాల్లో విభేదించారు. సీఎస్... వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు... ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతగా మారిపోతున్న పరిస్థితి.

కొత్త ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన సుబ్రహ్మణ్యం... ప్రభుత్వాన్ని ఏప్పుడు ఏర్పాటుచేయబోతున్నారని అడిగినట్లు తెలిసింది. దీనిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న జగన్... పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత... పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి... వారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఐతే... ఈ నెల 30న మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

ఓమైగాడ్... ఏపీ సచివాలయంలో ఫైల్స్ ధ్వంసం... ఏదో జరుగుతోంది...

లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సన్నీలియోన్... ఎలాగంటే...

ఇక నవరత్నాలు, మేనిఫెస్టో అమలుపై వైసీపీ దృష్టి... రైతులకు అధిక ప్రాధాన్యం...రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...
Published by: Krishna Kumar N
First published: May 23, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading