AP ASSEMBLY ELECTION RESULT 2019 MAN COMMITTED SUICIDE AFTER LOSING BET ON TDP IN ANDHRA PRADESH NK
అభిమాని ప్రాణం తీసిన బెట్టింగ్... టీడీపీ గెలుస్తుందని పందెం కాసి...
2014 ఎన్నికల్లో పార్టీలు ఖర్చుపెట్టిన సొమ్ము కంటే ఇది దాదాపు రెట్టింపు.
AP Assembly Election Result 2019 : బెట్టింగ్ అనేది ఎంత ప్రమాదకరమో చెబుతున్న ఘటన ఇది. టీడీపీ గెలుస్తుందని రూ.12 లక్షలు పందెం కాసిన అభిమాని... చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.
మనందరం ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నామో అదే జరిగింది. టీడీపీ నేతలు పదే పదే తమ పార్టీ గెలుస్తుందని చెప్పడంతో అదే నిజమని నమ్మిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ పార్టీ అభిమాని వీర్రాజు రూ.12 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశాడు. తీరా చూస్తే టీడీపీ భారీ తేడాతో ఓడిపోయింది. అంతే... ఫలితాలు చూశాక... తీవ్ర వేదన చెందాడు. డబ్బు రాకపోయినా పర్వాలేదు... కానీ ఉన్న డబ్బు పోయేసరికి తట్టుకోలేకపోయాడు. క్షణక్షణం అదే తలచుకుంటూ... అయ్యో టీడీపీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోవాలి... అలా ఓడిపోయే పరిస్థితి ఉన్నా... 110 నుంచీ 130 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ అధినేత సహా చాలా మంది టీడీపీ నేతలు ఎందుకు అలా చెప్పాలి అనుకుంటూ మదన పడ్డాడు. ఇక తాను జీవితంలో కోలుకోలేనని అనుకుంటూ... చేతిలో ఉన్న కాస్త డబ్బుతో... పురుగుల మందు డబ్బా కొనుక్కున్నాడు. ఎవరికీ చెప్పకుండా గటగటా తాగేశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా... ఉండ్రాజవరం మండలం... వేలి వెన్ను గ్రామలో ప్రజలు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీర్రాజు టీడీపీ నేతల సర్వేలు, ప్రకటనలను అందరికీ చూపించేవాడనీ, లగడపాటి చెప్పిన మాటల్ని కూడా అందరికీ చెప్పి... టీడీపీ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటూ... పందేలు కాశాడనీ, ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014లో గోదావరి జిల్లాలు టీడీపీకి మొగ్గు చూపాయి. పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఒక్క సీటు కూడా వైసీపీకి ఇవ్వలేదు. ఈసారి మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దాంతో వీర్రాజు... తాను అనుకున్నదేంటీ, జరిగిందేంటీ అని పదే పదే ఆలోచిస్తూ... ఆవేదన చెందాడు. పురుగుల మందు తాగిన వీర్రాజు గిలగిలా కొట్టుకుంటుంటే... కుటుంబ సభ్యులు చూసి... హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. వద్దంటే పందేలు కాసి... ప్రాణాలు తీసుకున్నాడంటూ... బోరున ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.