హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ అనే నేను... రెడీ అవుతున్న వైసీపీ... 19న నేతలతో జగన్ కీలక సమావేశం...

జగన్ అనే నేను... రెడీ అవుతున్న వైసీపీ... 19న నేతలతో జగన్ కీలక సమావేశం...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

AP Assembly Election 2019 : టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలూ వెయ్యడంలో దిట్ట. చేతిదాకా వచ్చే అధికారం చేజారిపోకుండా చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్న జగన్... ఆలస్యంగానైనా అప్రమత్తం అవుతున్నారు.

  రాజకీయాల్లో ఎవరైతే ముందుగా, వేగంగా, తెలివిగా పావులు కదుపుతారో వాళ్లు ఎన్నికల ఫలితాల్లో వెనకబడినా, అధికారాన్ని దక్కించుకోవడంలో ముందుంటారు. ఆ మధ్య జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే అందుకు నిదర్శనం. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ అధికారానికి 7 స్థానాల దూరంలో ఉండిపోగా... తెలివిగా పావులు కదిపిన కాంగ్రెస్... జేడీఎస్‌తో కలిసి అధికారాన్ని దక్కించుకుంది. ఏపీలో ఆల్రెడీ తమకు క్లియర్ మెజార్టీ వస్తుందనే నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలు... ఇంకో రెండు వారాల సమయం ఉండగా సడెన్‌గా అలర్టయ్యాయి. సర్వేలనే నమ్ముకుంటే అడ్డంగా బుక్కయ్యే ప్రమాదం కూడా ఉంటుందని సీనియర్లు చెప్పడంతో జగన్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అంచనాలు తలకిందులై... మ్యాజిక్ మార్క్ (88 స్థానాలు) కంటే కాస్త తక్కువ సీట్లు వస్తే ఏం చెయ్యాలన్న అంశంపై దృష్టి పెట్టాలని జగన్ డిసైడయ్యారు.


  19న కీలక సమావేశం : ఈ నెల 19న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయి. అదే రోజు సాయంత్రం జగన్... తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, కీలక నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెబుతున్నాయో విశ్లేషించే సమీక్ష జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వైసీపీకి ఫుల్ మెజార్టీ వస్తుందని వచ్చినా, లేక మెజార్టీ కంటే తక్కువ స్థానాలు వస్తాయని వచ్చినా... అప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని జగన్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.


  ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేలు... నియోజక వర్గ ఇంఛార్జులుగా పనిచేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకు ఓ రూల్ అమలు చేశారు. ఆ రూల్ వల్ల గెలుపుపై ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదని భావించిన చంద్రబాబు... ఈసారి ఎన్నికల్లో ఆ రూల్ తొలగించారు. అందువల్ల అభ్యర్థులంతా కచ్చితంగా గెలిచి తీరాలనే కండీషన్ అమలైంది. ఈ విధానాన్ని కాస్త మార్చిన జగన్... ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంఛార్జిని నియమించబోతున్నారు. ఆ ఇంఛార్జి... ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి గందరగోళమూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది.


  ప్రధానంగా ఏపీలో డబ్బుతో ఎమ్మెల్యేలను కొనేసే సంస్కృతి ఉందని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. ఈ నెల 23న ఫలితాలు వచ్చాక, టీడీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి, తమ ఎమ్మెల్యేలను డబ్బు ఎరవేసి లాగేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్... ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలంతా నియోజక వర్గ ఇంఛార్జులతో టచ్‌లో ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది.


  అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వం : వైసీపీకి అసెంబ్లీ స్థానాలు మెజార్టీకి కాస్త దగ్గరి దాకా వచ్చి ఆగిపోతే... అప్పటికప్పుడు ఇతర పార్టీలతో చర్చించి, హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జగన్ తగిన సూచనలు, సలహాలను సీనియర్ల నుంచీ తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ విషయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరవెనక మంత్రాంగం నడిపిస్తున్నారనీ, హంగ్ వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీకి పూర్తి అవకాశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.


  ఈ పరిస్థితుల మధ్య ఈ నెల 19న జరిగే సమావేశం అత్యంత కీలకమైనది కాబోతోంది. ఇందులో జగన్ తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయంటున్నాయి వైసీపీ వర్గాలు.


   


  ఇవి కూడా చదవండి ;


  ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...


  వైసీపీ గెలిస్తే, వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా...? రెడీ అవుతున్న లిస్ట్...?


  ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...


  దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు