హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ... చంద్రగిరి : ఏడు కేంద్రాల్లో రీపోలింగ్... భారీ భద్రతా ఏర్పాట్లు...

ఏపీ... చంద్రగిరి : ఏడు కేంద్రాల్లో రీపోలింగ్... భారీ భద్రతా ఏర్పాట్లు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Assembly Election 2019 : ఎప్పుడూ లేని విధంగా ఈసీ ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చిత్తూరు పార్లమెంట్... చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి... చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,451మంది ఓటర్లు ఇవాళ ఓటు వేస్తున్నారు. ముందుగా 5 స్థానాలకు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది. చివరి నిమిషంలో వెంకట్రామాపురం కుప్పం బాదూరు, కాలేపల్లి పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదివరకు ఇక్కడ అల్లర్లు జరగడంతో ఈసారి అలా కాకుండా... ఒక్కో పోలింగ్‌బూత్‌కు 250 మంది పోలీసుల్ని నిఘా పెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ చేస్తూ రీపోలింగ్ జరిపిస్తున్నారు. నేతలు, చోటా మోటా నాయకులు ఎక్స్‌ట్రాలు చేస్తే, తాట తీస్తామని హెచ్చరించారు.


  పోలింగ్ జరిగే కేంద్రాలు 321 ఎన్ ఆర్ కమ్మపల్లి, 104 పులివర్తివారిపల్లి, 316 కొత్తకండ్రిగ, 316 కమ్మపల్లి, 313 వెంకట్రామాపురం, 310 కాలేపల్లి, 323కుప్పంబాదూరు... ఆదివారం ఉదయం 7గంటల నుంచీ పోలింగ్ ప్రారంభిస్తామనీ... సాయంత్రం 6 గంటల వరకు అది కొనసాగుతుందనీ అధికారులు తెలిపారు. చిత్తూరు పార్లమెంటు, చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చెందిన ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు. ఏప్రిల్ 11న జరిగినట్లు, ఈసారి జరగదంటున్న నేతలు... ప్రజలంతా వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.


  ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,800 పోలింగ్ కేంద్రాలు ఉండటంతో అన్నింటినీ వెబ్‌కాస్టింగ్‌లో పరిశీలించలేకపోయారు. తాజాగా వైసీపీ నుంచీ వచ్చిన కంప్లైంట్‌తో అన్నీ పరిశీలించి, రీపోలింగ్ జరిపిస్తున్నా్రు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 60 మంది ఎన్నికల సిబ్బంది డ్యూటీలో ఉంటున్నారు. డిప్యూటీ కలెక్టర్ రేంజ్ అధికారి అదే పోలింగ్ కేంద్రాన్ని గమనిస్తూ ఉంటున్నారు. వాళ్లతోపాటూ ప్రతి పోలింగ్ కేంద్రానికీ ప్రత్యేక ఉన్నతాధికారి, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఓటరూ ఓటు వేయాలన్నదే అందరి లక్ష్యం. ఐతే... ఓటరు స్లిప్‌తో పాటు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు తీసుకురావాలని కండీషన్ పెట్టారు.


   


  ఇవి కూడా చదవండి :


  నేడు ఏడో దశ పోలింగ్... బరిలో ఉన్న ప్రముఖులు వీరే...


  ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...


  రూ.10 నాణేనికి ఓ దండం... వద్దంటున్న ప్రజలు...

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు