టీడీపీ ఓడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు... చంద్రబాబు వ్యూహం అదేనా... భయపెడుతున్న 20 సర్వేలు...

AP Assembly Election 2019 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక... 42 రోజులు ఫలితాల కోసం ఎదురుచూసేలా చెయ్యడం లేనిపోని సమస్యలకు దారితీస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. విజయం తమదేనని చెబుతున్న టీడీపీ... లోలోపల మాత్రం ఓటమిపై టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 7:57 AM IST
టీడీపీ ఓడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు... చంద్రబాబు వ్యూహం అదేనా... భయపెడుతున్న 20 సర్వేలు...
చంద్రబాబు, జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మే 23 వరకూ తేలని అంశమే. ఐతే... పోలింగ్ పూర్తవగానే అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలూ... ఫుల్ కాన్ఫిడెన్స్‌తో విజయం తమదేనని చెప్పాయి. రెండు పార్టీల్లోనూ రెట్టించిన ఉత్సాహం కనిపించింది. చిత్రమేంటంటే అప్పట్లో వచ్చిన సర్వేలు కూడా కొన్ని పూర్తిగా టీడీపీకీ, కొన్ని పూర్తిగా వైసీపీకి విజయం తథ్యమని చెప్పాయి. జ్యోతిష్యులు కూడా చంద్రబాబు టైం బాగుందని కొందరు, వైఎస్ జగన్ జాతకం బాగుందని కొందరూ చెప్పారు. ఇలా టీడీపీ, వైసీపీ మధ్య ఫలితాల విషయంలో హోరాహోరీ కనిపించింది. ఐతే... ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలన్న అంశంపై ముందుగానే జాగ్రత్త పడిన టీడీపీ అధినేత చంద్రబాబు... సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన... ఎన్నికలు జరిగాక, ఈవీఎంలు సరిగా పనిచెయ్యలేదనీ, వీవీప్యాట్లు సరిగా స్లిప్పులు చూపించట్లేదనీ ఆరోపణలు చేశారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ ఓడితే... తప్పంతా ఈవీఎంలదే అని జాతీయస్థాయిలో గళం వినిపించేందుకు ముందుగానే ఆయన జాతీయస్థాయి నేతలను కలిసి... ఏకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే వరకూ వ్యవహారాన్ని తీసుకెళ్లారన్న చర్చ నడుస్తోంది.

రాన్రానూ టీడీపీ గెలుపుపై చంద్రబాబులో నమ్మకం తగ్గిపోతుందనీ... ప్రధానంగా... రెండు వారాలుగా వస్తున్న దాదాపు 20 సర్వేలను పరిశీలించిన చంద్రబాబు... వాటిలో చాలా వరకూ వైసీపీకే అధికారం దక్కుతుందని చెప్పడంతో మరింత ఆందోళన చెందుతున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అసలీ సర్వేలను నమ్మితే లేనిపోని టెన్షన్లు తప్పవనుకున్న చంద్రబాబు... తనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి... క్షేత్రస్థాయిలో ప్రతీ పోలింగ్ బూత్ నుంచీ టీడీపీ ఏజెంట్ల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈనెల 22 వరకూ ఈ సమీక్షలు జరగనున్నాయి. రిపోర్టుల్లో వచ్చిన ఫలితాల్ని బట్టీ... టీడీపీకి ఏ స్థాయిలో ఓట్లూ, సీట్లూ దక్కుతాయన్నదానిపై చంద్రబాబు ఓ అంచనాకు రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే... ఏజెంట్లు వాస్తవ పరిస్థితిని చెబుతారా... ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే... ఆ వాస్తవాల్ని చంద్రబాబుకి ఉన్నది ఉన్నట్లు వివరిస్తారా అన్నది అనుమానమే.

సమీక్షలతో వాస్తవం తెలుస్తుందన్న నమ్మకం లేకపోయినా... టెన్షన్ నుంచీ తప్పించుకునేందుకు... చంద్రబాబు సమీక్షల్లో తలమునకలవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే... ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోతే... చంద్రబాబు ఒప్పుకోరనీ, కచ్చితంగా జాతీయ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలూ చేయించి... మిగతా పార్టీల మద్దతు కూడగట్టి... తిరిగి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపించేలా గట్టిగా పట్టుపడతారని తెలుస్తోంది. అదే జరిగితే తమకు దక్కే అధికారం చేజారే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్... కచ్చితంగా ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలనే (ఒకవేళ వైసీపీ ఓడిపోయినా సరే) ఫైనల్ ఫలితాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాలని డిమాండ్ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టెన్షన్లు ఉండటం వల్లే జగన్... తన విహార యాత్ర పర్యటనలు కూడా వాయిదా వేసుకున్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించడమనే ప్రసక్తే ఉండదంటున్నారు ఎన్నికల అధికారులు. 46వేల ఈవీఎంలు వాడితే... 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయనీ, వాటిలోనూ 300 ఈవీఎంలను సరిచెయ్యగా. మరో 100 ఈవీఎంలను మాత్రం మార్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఫలితాలు ఎలా వచ్చినా, పార్టీలు ఒప్పుకోవాల్సిందే తప్ప... ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

వైఎస్ జగన్... ఏపీ ముఖ్యమంత్రి... నేమ్‌ ప్లేట్ రెడీ అవుతుంది...నేడు CBSE 10th ఫలితాలు విడుదల... ఎలా చెక్ చేసుకోవాలంటే...

నేడు ఏపీలో గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్... 447 పోస్టులు... ఒక్కో పోస్టుకీ 660 మంది పోటీ

రేపు ఒడిశాలో పీఎం నరేంద్ర మోదీ పర్యటన... నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
First published: May 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading