ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవనున్నాయి. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యలో.. 16 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 16న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఐతే కరోనా నేపథ్యంలో వీలైనంత తక్కువ రోజుల్లోనే సమావేశాలను ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Published by:Shiva Kumar Addula
First published:June 11, 2020, 14:11 IST