Ap Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 27న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, BAC సమావేశం జరగనుంది. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా తీర్మానాలు ఉండనుండగా..అనంతరం అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తం 13 రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే 27,28 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly Sessions) జరుగుతాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగం, BAC సమావేశం జరగనుంది. ఇక 28వ తేదీన సంతాప తీర్మానాలు, వాయిదా తీర్మానాలు ఉండనున్నాయి. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయనున్నారు. మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ కారణంగా తిరిగి అసెంబ్లీ సమావేశాలను మార్చి 6న ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలు 13 రోజుల పాటు జరగనున్నాయి. త్వరలోనే అసెంబ్లి బడ్జెట్ సమావేశాల (Ap Assembly Sessions)కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రానుంది.
ఇక 3 రాజధానుల బిల్లు (AP 3 Capitals Bill) మళ్లీ ప్రవేశపెట్టే అంశంపై.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసారి పక్కాగా బిల్లును ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున.. మరింత మెరుగైన బిల్లుతో వస్తామని సీఎం వైఎస్ జగన్ అప్పట్లోనే చెప్పారు. ఆ తరువాత ఇప్పటివరకు దాని గురిచి చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈసారి బిల్లును ప్రవేశపెట్టాలని.. మూడు రాజధానులపై ఆలస్యం చేయకూడదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా గతేడాది బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శపథం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక జీవో నెంబర్ 1, మూడు రాజధానుల అంశంతో ఈసారి అసెంబ్లి సమావేశాలు హాట్ హాట్ సాగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP Assembly, AP News