హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. రేప్ చేస్తే ఇక ఉరే..

దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. రేప్ చేస్తే ఇక ఉరే..

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారు.

బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. దిశకు తగిన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి మరోసారి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

First published:

Tags: AP Assembly, AP News, Disha Act

ఉత్తమ కథలు