ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ ఒప్పందం ?

హైదరాబాద్‌తో పాటు తెలంగాణో ఇతర ప్రాంతాల నుంచి కూడా విజయవాడ, విశాఖపట్టణంతం, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నడపుుతోంది.

news18-telugu
Updated: December 3, 2019, 7:59 AM IST
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ ఒప్పందం ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... ఇటు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సైతం డిమాండ్ చేశారు. 52 రోజుల పాటు సమ్మె చేపట్టారు. అయితే తెలంగాణ ఆర్టీసీకి మాత్రం సీఎం కేసీఆర్ షాకిచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేది లేదని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి చేరాలన్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీల్ని పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిటీ బస్సు నుంచి ఇతర జిల్లాలకు తిరిగే గరుడ, సూపర్ డీలక్స్ బస్సుల వరకు అన్నింటా బస్సు ఛార్జీలు పెంచారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రెండు రకాలుగా బస్సు ఛార్జీలు అమలవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ బస్సులు కూడా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణో ఇతర ప్రాంతాల నుంచి కూడా విజయవాడ, విశాఖపట్టణంతం, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నడపుుతోంది. ఇలాంటి సర్వీసుల్లో ఏపీ బస్సుల కంటే ఛార్జీలు తెలంగాణ బస్సులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల బస్సులు ఒకే రూట్లో తిరిగినప్పుడు రెండు రాష్ట్రాల బస్సుల్లో ఛార్జీ్లలో బాా తేడా తెలుస్తోంది. అలాంటప్పుడు ఏపీ బస్సుల్ని ప్రయాణికుల్ని ఎంచుకునే అవాశం ఉంది. బస్సు ఛార్జీలు కిలోమీటర్‌కు 20 పైసలు పెరగనుండటమే ఇందుకు కారణం.

దీంతో ఏపీ బస్సుల్లో ప్రయాణమే జనం చౌకగా భావించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ బస్సు ఛార్జీల పెంపు ప్రభావం ఏపీ ప్రజలపైనా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉందని సమాచారం. టీఎస్ఆర్టీసీ నుంచి కేవలం మూడు బస్సులే ఉన్నందున వాటిలో ఎక్కువగా పెంచబోరని, ఏపీ బస్సులతో పోల్చి చూసుకుని అతి తక్కువ వ్యత్సాసం ఉండేలా అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: December 3, 2019, 7:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading