స్టూడెంట్స్ బీ రెడీ... మే రెండో వారంలో ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్...

AP 10th Class Exam 2019 Results : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (BSEAP)... టెన్త్ క్లాస్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 9:16 AM IST
స్టూడెంట్స్ బీ రెడీ... మే రెండో వారంలో ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23న అర్థరాత్రికి కంప్లీట్‌గా రానున్నాయి. ఈ లోపే టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు వచ్చేస్తాయంటే అది స్టూడెంట్స్‌కీ, వాళ్ల పేరెంట్స్‌కీ ఆనందకరమైన విషయమే. BSEAP కమిషనర్ సంధ్యా రాణి తియ్యటి వార్త చెప్పారు. ఏంటంటే... మే రెండో వారంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంటే మరో 10 రోజుల్లో వచ్చేస్తాయన్నమాట. ప్రస్తుతం పేపర్ల వాల్యుయేషన్ జరుగుతోందంట. ఈ పనిలో 21 వేల మంది టీచర్లు ఉన్నారని వివరించారు. మీకు తెలుసు... తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ అవకతవకల వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో. వాటిని కళ్లారా చూసిన బోర్డు... ఏ మాత్రం కంగారు పడకుండా... అత్యంత జాగ్రత్తగా టెన్త్ పేపర్ల వాల్యుయేషన్ జరిపిస్తోందని తెలిసింది.

ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో కలిపి... దాదాపు 80 లక్షల ఆన్సర్ పేపర్లు ఉన్నాయి. ఇప్పటివరకూ 80 శాతం వాల్యుయేషన్ పూర్తైనట్లు తెలిసింది. కడప జిల్లాలో మాత్రం 90 శాతం పేపర్లను దిద్దేశారు. రెండు మూడు రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేస్తారని తెలిసింది. ఇక మంచి రోజు చూసుకొని రిజల్ట్స్ రిలీజ్ చెయ్యడమే మిగిలి ఉంటుందన్న మాట.


టెన్త్ అయిపోయాంక నెక్ట్స్ ఏంటి అన్నది ఆలోచించుకునే పనిలో టెన్త్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి మిగతా క్లాసుల విద్యార్థులేమో... నెక్ట్స్ తరగతికి సంబంధించి ఏ సబ్జెక్టులు ఉంటాయి. ఏ బుక్స్ కొనుక్కోవాలి వంటి ఆలోచనల్లో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వచ్చే 20 రోజుల్లో అన్ని జిల్లాలకూ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ పంపించేందుకు రెడీ అవుతోంది.

2019లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని 6,17,484 మంది స్టూడెంట్స్ రాశారు. మార్చి 18 నుంచీ ఏప్రిల్ 2 వరకూ పరీక్షలు జరిగాయి. ఫలితాల్ని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్... bseap.org లో చూసుకోవచ్చు. సో, స్టూడెంట్స్... బీ రెడీ.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

టైమ్ ట్రావెల్ సాధ్యమేనా... ఈ ప్రపంచంలో రియల్ అవెంజర్స్ ఉన్నారా... ఆధారాలు ఇవిగో....
First published: April 30, 2019, 9:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading