ACB Raids in AP: ఏపీలోని ఏడు జిల్లాల్లో ఏసీబీ దాడులు

రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

news18-telugu
Updated: September 2, 2020, 5:01 PM IST
ACB Raids in AP: ఏపీలోని ఏడు జిల్లాల్లో ఏసీబీ దాడులు
ఏసీబీ లోగో
  • Share this:
Andhra Pradesh ACB Raids | ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అధికారుల మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై కూడా దాడులు జరిగాయి. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యమైంది. విశాఖ జిల్లా కసింకోట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. బలిజపేట ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గార ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. తన ప్రమాణస్వీకారం రోజునే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అవినీతి నిరోధం కోసం ఓ కాల్ సెంటర్ తీసుకొచ్చారు. 14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలో అవినీతి మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఆ విధంగా గత కొన్ని రోజుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యం..వీడియో


ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దిశ చట్టం తరహాలోనే అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని యోచిస్తోంది. అవినీతి నిరోధక శాఖతో జరిపిన సమీక్షలో కొన్నిరోజుల క్రితం సీఎం జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు. ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 2, 2020, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading