హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Changes in Ocean: ఏపీలో మళ్లీ భయం భయం.. వెనక్కు వెళ్తున్న సముద్రం.. ఈ మార్పు దేనికి సంకేతం

Changes in Ocean: ఏపీలో మళ్లీ భయం భయం.. వెనక్కు వెళ్తున్న సముద్రం.. ఈ మార్పు దేనికి సంకేతం

Changes in Ocean: ఆంధ్రప్రదేశ్ ను సముద్ర తీరం మళ్లీ భయపెడుతోంది. గతంలో ఒక్కసారిగా వెనక్కు వెళ్లిన సముద్రం మళ్లీ సాధారణ స్థాయికి వస్తే అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ తాజాగా సముద్రుడు భయపెడుతున్నారు. రెండు కిలోమీటర్లు సముద్రం వెనక్కు వెళ్లడం ఆందోళన పెంచుతోంది.. ఇది దేనికి సంకేతం అంటూ స్థానికులు భయపడుతున్నారు.

ఇంకా చదవండి ...

  Changes in Ocean:  ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన తీరప్రాంతం (Coastal Andhra) ఉంది. అమదైన పల్లెలు, బీచ్ లు తీరప్రాంతంలో ఉన్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని, మత్స్యకారులకు జీవనాధారాన్ని కల్పిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే అలాంటి  సముద్రం ఇప్పుడు అల్లకల్లోలంగా మారుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల సముద్ర తీర ప్రాంతాలను పరిశీలిస్తే గత కొన్ని రోజులుగా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari) అంతర్వేదిలో సముద్రపు అలలు స్థానికులను అందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రం పెద్ద పెద్ద అలలతో ముందుకు రావడం.. మరో రోజు  వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగుతోంది. ఆ మధ్య కాలంలో.. అంటే రెండు నెలల ముందు వరకు   అంతర్వేది తీరంలో సముద్రం ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కివెళ్లింది. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. బంగాళాఖాతంలో గోదావరి నది (Godavari River) కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది తీరంలో సాధారణంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. నిత్యం సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్లను ముంచేస్తుంటుంది. ఆ మధ్య అలలు ముందుకొచ్చి ఓ హోటల్ ను ముంచెత్తాయి. దీంతో అది ధ్వంసమైంది. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో స్థానికులంతా భయాందోళనకు గురవుతూ ఉండేవారు. ఇఫ్పుడు మరో రకమైన భయం వెంటాడుతోంది.

  అంతర్వేది(Antarvedi) వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు పూర్తి భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం.. ఉన్నట్లుండి లైట్ హౌస్ కు రెండు కిలో మీటర్లు వెనక్కు వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో (Bay of Bengal) గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి(Sakhinetipalli) మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు, వెనక్కు వెళ్లే సముద్రం.. తాజాగా వెనక్కు వెళ్లిపోవడంతో విచిత్ర పరిస్థితిని చూసి తీర ప్రాంత గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

  అయితే ఇలా సముద్రం వెనుకకు వెళ్ళడం వెనుక బలమైన కారణం ఉంటుందని భయపడుతున్నారు. భవిష్యత్తులో ఏర్పాడే విప్పతుల గురించి సముద్రం హింటిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందు ముందు ఏర్పడే విపత్కర పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడుతున్నారు. సముద్ర తీరానికి 7 కిలోమీటర్లు దూరంలో ఉండే ఐలాండ్ కనుమరుగు కావడంపై పర్యటనకు వెళ్లే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, East godavari, Ocean

  ఉత్తమ కథలు