YSR Kalyanamastu: సంక్షేమ సారథిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా..? కేంద్రం నుంచి సాయం రాకపోయినా.. సంక్షేమ పథకాలు ఆపడం లేదు.. చెప్పినవే కాకుండా.. కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ముందు చెప్పిన విధంగానే.. సమయానికి కాస్త అటు ఇటుగా.. ఆలస్యం లేకుండానే విడతల వారిగా పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
గత ఎన్నికలకు ముందు.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతుందన్నారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు..? ఎలా పథకానికి అప్లై చేసుకోవాలి.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. ఇంకా ఎలాంటి కండిషన్లు ఉన్నాయి లాంటి అన్ని విషయాలు స్పష్టం చేసింది ప్రభుత్వం.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద సాయం ఇదే..
ఎస్సీ, ఎస్టీలకు 1 లక్ష రూపాయలు
ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు లక్ష 20వేల రూపాయలు
బీసీలకు 50 వేల రూపాయలు
బీసీ కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు
మైనార్టీలకు లక్ష రూపాయలు
వికలాంగుల వివాహాలకు 1,50,000 రూపాయలు
భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు
ఇదీ చదవండి : కొడాలి వర్సెస్ దగ్గుబాటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కారణం అదే..?
అర్హతలు ఏంటి..?
ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అయితే ఈ పథకం పొందేందుకు అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాల నిబంధనను ఫైనల్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.
ఇదీ చదవండి : ఆ మంత్రికి తెలుగురాదా? రిటైర్మెంట్ తీసుకో అంటూ జగన్ సీరియస్ అయ్యారా..? ఎవరా మంత్రి?
కండిషన్లు ఇవే..?
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ . ఈ పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు సాయాన్ని సీఎం జగన్ ఇస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఓ కండిషన్ పెట్టారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు. నిరక్ష్యరాస్యతను రూపుమాపే చర్యల్లో భాగంగానే ఈ నిబంధన పెట్టామని మంత్రి బొత్స వివరించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?
అర్హతలు.. విధి విధానాలు ఇవే..
1. వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నవశకం మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
2.వివాహ తేదీ నాటికి పధువు వయస్సు 18. వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. కచ్చితంగా ఇద్దరికీ తొలి వివాహమై ఉండాలి
వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి
3.వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
4.మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
5.కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు.
6.పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంది.
7.నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.
8.నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
9.ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
10. మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes