హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap Capital: ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటీషన్..!

Ap Capital: ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటీషన్..!

సుప్రీంకోర్టు (File Image)

సుప్రీంకోర్టు (File Image)

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటీషన్ దాఖలు అయింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ పిటీషన్ పై ధర్మాసనం విచారణ జరపనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటీషన్ దాఖలు అయింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ పిటీషన్ పై ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా ఏపీ రాజధానిని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఆదేశాలివ్వగా..సర్కార్ ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మరి నేడు జరగబోయే విచారణలో ఎలాంటి వాదనలు వినిపిస్తారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

RK Roja | Viral Photos: ఉద్యోగితో చెప్పులు మోయించిన ఏపీ మంత్రి ఆర్కే రోజా .. వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియో

ఇక ఏపీలోని మూడు రాజధానుల అంశం ఈ నెల 23న విచారణకు సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం... ప్రతివాదులతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసు విచారణను సాధ్యమైనంత తొందరగా చేపట్టాలని అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 23న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తే విశాఖకు(Visakhapatnam) పరిపాలన రాజధానిని తరలించాలని ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది.

Gold Rate Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు ..58వేలకు చేరువలో 10గ్రాముల గోల్డ్ ధర

ఢిల్లీలో ఈ నెల 31 జరిగిన గ్లోబల్ సమ్మిట్ సమావేశంలో ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుందని అన్నారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ కేంద్రంగానే రాష్ట్ర కార్యకలాపాలు జరగనున్నాయని చెప్పారు. సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఇక మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి భారీగా పెట్టుబడిదారులు రావాలని జగన్ కోరారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం కూడా కావాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గడిచిన మూడేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.

మరి హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు కాగా సుప్రీంకోర్టులో ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.

First published:

Tags: Ap, Supreme Court

ఉత్తమ కథలు