Andhra Pradesh: సౌర.. పవన విద్యుత్ పీపీఏలలో మరో జగన్మాయ.. మండిపడ్డ టీడీపీ

ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న సామెత జగన్మోహన్ రెడ్డిని చూసే పుట్టి ఉంటుంది అంటున్నది టీడీపీ. సౌర, పవన విద్యుత్ పీపీఏ ల మీద జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ పోలిట్ బ్యూరో మండిపడింది.

news18
Updated: November 11, 2020, 11:40 AM IST
Andhra Pradesh: సౌర.. పవన విద్యుత్ పీపీఏలలో మరో జగన్మాయ.. మండిపడ్డ టీడీపీ
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 11, 2020, 11:40 AM IST
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో సౌర.. పవన్ విద్యుత్ పీపీఏ లలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై టీడీపీ పొలిట్ బ్యూరో మండిపడింది. ఈ మేరకు  ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన యధాతథంగా... ‘ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న సామెత జగన్మోహన్ రెడ్డిని చూసే పుట్టి ఉంటుంది. సౌర, పవన విద్యుత్‌ పీపీఏలకు సంబంధించి జగన్ ప్రభుత్వం నవంబర్ 7, 2020 న విడుదల చేసిన జీవో ఎంఎస్ 25 ఇందుకు సరిగ్గా పరిపోతుంది. అధికారం చేపట్టిన మొదటి నెలలోనే విద్యుత్ రంగంలో ముఖ్యంగా సోలార్ పవర్ లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రచారం చేశారో వాటినే ఇప్పుడు జి.ఓ నం 25 లో పొందుపరిచారు. నాడు అగ్రిమెంట్లు అన్ని నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గైడ్ లైన్స్ ప్రకారమే ఉన్నాయని.. అందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ ఎంత చెప్పినా వినలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడారు.

ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అయితే మరో అడుగు ముందుకేసి మరీ 25 ఏళ్ల అగ్రిమెంట్ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టమని.. టెక్నాలజీ పెరిగేకొద్ది రేట్లు తగ్గుతాయి కానీ పెరుగుతాయా..? అంటూ గంటల కొద్దీ మీడియా ముందు వాపోయారు. కానీ సరిగ్గా సంవత్సరన్నర గడిచేసరికి ఏ అగ్రిమెంట్ వల్ల రాష్ట్రానికి నష్టం అన్నారో.. వాటికి మించిన రాయితీలతో 30 ఏళ్లకు కొత్త అగ్రిమెంట్ కి సిద్ధమయ్యారు. ఉత్పత్తి నిలిపేసినా కూడా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. ఉత్పత్తి నిలిపివేసిన సమయంలో పరిహారం చెల్లించే సదుపాయం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఎవరి కోసం ఈ సదుపాయం పెట్టారు?.

కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని చెప్పడం ఎవరి ప్రయోజనం కోసం. అగ్రిమెంటు కాల వ్యవధి 30 ఏళ్లు ముగిసిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడం, గ్రిడ్ సెక్యురిటీ, పనిముట్ల భద్రత విషయంలో ‘జనరేషన్ కాంపెన్షేషన్’ అనే క్లాజ్ పెట్టడం ఏ స్వార్ధప్రయోజనాల కోసం? ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజిఈసిఎల్) కు కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లను నేరుగా డెవలపర్లకు ఇస్తామని చెప్పడం ఎవరిని మెప్పించడం కోసం? ప్లాంట్ పెట్టడానికి ఒక ఎకరానికి లీజు గత ప్రభుత్వం 31,000 నిర్ణయిస్తే దానిని 25,000 తగ్గించారు. ఇవన్నీ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో భాగంగానే చేస్తున్నామని చెబుతున్నప్పుడు.. ఈ విచక్షణ ఏడాదిన్నర క్రితం ఏమైంది..? ఈ జీఓ నెం.25తో అప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తునట్లేనా.?

అబద్దాలు, అసత్య ప్రచారం తప్పా జగన్ రెడ్డి సర్కారుకు అభివృద్ధి తెలియదు. ఈ జీవోతో రాద్దాంతమే మీ సిద్దాంతమని మరోసారి రుజువైంది. విద్వేషం, విషప్రచారం తప్ప మీ ప్రభుత్వానికి విజ్ఞత లేదనడానికి ఇదొక ఉదాహరణ. ఎన్నటికీ తరగని శక్తి ఉన్న సౌరశక్తిని కూడా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం పీపీఏల గడువు కనీసం పాతికేళ్లు ఉండాలని మరలా సవరణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ సలహాదారు మాట తప్పారా..? లేక మీరు మడమ తిప్పారా..?

సౌర విద్యుత్ ఉత్పాదకతలో టిడిపి ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న చర్యలను కేంద్ర సంస్థలు ప్రశంసించడమే కాకుండా పలు రాష్ట్రాలు అనుసరించాయి. కానీ నేడు జగన్ చర్యలతో సౌర విద్యుత్ పెట్టుబడిదారులు ఏపీ అంటేనే బయపడుతున్నారు. గతంలో ఉన్న విద్యుత్ ఒప్పందాలను సక్రమంగా అమలు చేయకుండా కొత్త ఒప్పందాలకు సిద్ధం కావటం వెనుక ఉన్న ఆతంర్యమేమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.’

-  కిమిడి కళా వెంకట్రావు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
Published by: Srinivas Munigala
First published: November 11, 2020, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading