రేపటి నుంచి తిరుచానూర్ అమ్మవారి బ్రహ్మోత్సవాలు..

తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు వేళైంది. శుక్రవారం నుంచి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

news18-telugu
Updated: November 21, 2019, 6:30 AM IST
రేపటి నుంచి తిరుచానూర్ అమ్మవారి బ్రహ్మోత్సవాలు..
శ్రీ పద్మావతి అమ్మవారు
  • Share this:
తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు వేళైంది. శుక్రవారం నుంచి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమయ్యే పద్మావతి అమ్మవారిని మేల్కొలిపి.. సహస్రనామార్చన, మూలవరులకు అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత అమ్మవారి ఉత్సవరులను శ్రీకృష్ణస్వామి ముఖమంటపానికి తీసుకొస్తారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించి, శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించనున్నారు. అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండుకళ్లు వంటివని టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీమత్ తిరుమల కాండూరు శ్రీనివాసాచార్యులు తెలిపారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>