అరుదైన వన్య ప్రాణులకు నెలవైన అభయారణ్యం శేషాచల అటవీ ప్రాంతం.. స్వామి వారి వైభవంతో పాటు వచ్చే యాత్రికులకు మనోవికాసాన్ని అందిస్తుంది తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం.. జూ పార్కులలో మినహా జనసంచారం ఉండే ప్రదేశాల్లో వన్య ప్రాణులను మనకు కనపడవు. చాలా అరుదుగా శేషాచల అటవీ ప్రాంతంలోని సాధు వన్యప్రాణులను చూడటం ఒక అద్బుతంగా భావిస్తారు భక్తులు. వాటితో ఫోటోలు దిగటం, వారి వెంట తెచ్చుకున్న ఆహారం వాటికీ పెడుతుండడంతో వన్య ప్రాణులు ఆహార అన్వేషణ మరచి పోతున్నాయా..?శేషాచలం అటవీ ప్రాంతంలోని సాధు జంతువుల మనుగడకే ముప్పు వాటిల్లనుందా అనే వాధనలు వినిపిస్తోన్నాయి.
సమస్త లోక రక్షకుడైన శ్రీశ్రీనివాసుడు కొలువైన దివ్య ప్రాంతం శేషాచలం. పచ్చని కొండల్లో ఆనంద రూపుడై వెలసిన ప్రాంతంలో ఎన్నో అరుదైన జంతు జాతులు అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కృష్ణ జింకలు, జింకలు, దుప్పులు, కనితులు,అనేక రకాల ఉడతలు, వివిధ రకాల వానరాలు, అడవి కోళ్ళు, నెమ్మళ్ళు, అడవి పందులు, వివిధ రకాల పక్షి జాతులతో పాటుగా క్రూర మ్రుగాలైన చిరుతలు, ఎలుగుబంట్లు,రేసు కుక్కలు అరుదైన సర్ప జాతులు, ముంగిసలకు అభయారణ్యంగా మారింది శేషాచలం.. తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణం చేసే రెండవ ఘాట్ రోడ్డు అరుదైన కొండముచ్చు వానర జాతులు కనిపిస్తాయి.
కనువిందు చేస్తున్నాయి.... ఈ జంతువులన్నీ వందల సంఖ్యలో ఘాట్ రోడ్డు పిట్టగోడపై కనిపిస్తూ తిరుమలకు వచ్చే భక్తులకు అరణ్య ప్రాంతం ప్రయాణాన్ని మధురానుభావంగా మారుస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్న సమయంలో ఈ వానరాలతో సరదాగా ఫోటోలు దిగుతూ వారు వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను, పండ్లను వానరాలకు అందిస్తూ సంతోషిస్తుంటారు.. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో మరిన్ని అరుదైన సాధు జంతువులు భక్తులకు కనువిందు చేస్తాయి.. ప్రప్రధమంగా జింకలు, దుప్పులు, ఖనితులు, కోతులు ఘాట్ రోడ్డు ఆవరణలో అధికంగా కనిపిస్తుంటాయి. జింకలు, దుప్పులు, ఖనితులు అరుదైన సాధు జంతు జాతులు కావడంతో వాటితో అధిక సంఖ్యలో భక్తులు ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.
ఫోటోలు తీసుకొనే క్రమంలో వాటికీ ఆహారాన్ని అందిస్తున్నామని సంబరపడి పోతుంటారు భక్తులు.. గతంలో జింకలను చూడాలంటే నడక దారిలోని జింకల పార్కుకు వెళ్ళాల్సిందే... కాని కొన్ని అటవీ శాఖ చట్టాలకు లోబడి జింకలను అటవీ ప్రాంతంలోకి విచిడి పెట్టింది టిటిడి.. సప్తగిరులు అనేక తీర్ధాలకు నెలవు.. అందులో భక్తులు ముఖ్యంగా స్వామి వారి ఆలయానికి 10కిలోమీటర్ల వ్యవదిలో వెలసిన శ్రీ జాపాలి హనుమాన్ ను విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. జాపాలి ఆలయం వద్ద అత్యంత అరుదైన అడవి ఉడుతలు కనిపిస్తాయి. అందంగా, పలు రకాల రంగుల్లో కనిపించే ఉదతలకు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచితే వాటితో ఫోటో పోజులు ఇవ్వడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపుతారు. ఫోటో తీసుకోవడమే కాకుండా వాటికి అరటి పళ్ళు, కొబ్బరి కాయ, వివిధ రకాల పండ్లను వాటికీ ఆహారంగా అందిస్తూ వస్తున్నారు. ఇలా ప్రతినిత్యం భక్తులు అందిస్తున్న ఆహారానికి బాగా అలవాటు పడ్డాయి ముగా జీవాలు.
ఆహారాన్వేషణను మరిచాయా..?...: ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అని భావిస్తూ ఉంటాం.. కానీ మనుష్యులను హడలెత్తించిన కరోనా వైరస్ ముగా జీవాలను ఆకలి కేకలు వేసేలా చేసింది.. నిత్యం లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకొనే భక్తులు వీటికి ఆహారం అందించడంతో భక్తులు ఇచ్చే ఆహారానికే ముగా జీవాలు బాగా అలవాటు పడ్డాయి. అరణ్య ప్రాంతంలో నివసించే ప్రాణులు ముఖ్యంగా ఎల్లప్పుడూ ఆహార అన్వేషణ గావిస్తుంటాయి.. శేషాచల అటవీ ప్రాంతంలో భక్తులు ముగా జీవాలన్ని వాటికీ ఆహారం అందించడంతో జీవన అన్వేషణను పూర్తిగా మరచిపోయాయి.
ఇంతలో కరోనా వైరస్ కారణంగా మార్చ్ 20వ తేది తాత్కాలికంగా స్వామి వారి దర్శనాన్ని నిలుపుదల చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.. భక్తులెవ్వరూ తిరుమలకు అనుమతించకుండా, స్థానికులను సైతం తిరుపతికి వెళ్ళకుండా కఠినమైన లాక్ డౌన్ నిబంధలను అమలు చేసింది టిటిడి.. పూర్తిగా ఘాట్ రోడ్డులో రవాణా స్తంభించడంతో వన్య ప్రాణులకూ ఆహార కొరత ఏర్పడింది.. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు ఆహారం కోసం బయటకు తిరుమలలోని బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్, మ్యుజియం, టిటిడి విఐపి వసతి సముదాయాలు గల పద్మావతి నగర్ లోకి ముగా జీవాల సంచారం అధికం అవుతూ వచ్చాయి. ఇటు తిరుపతిలోని జూపార్క్ రోడ్డు, జీవకోన అటవీ ప్రాంతం, రెండవ ఘాట్ రోడ్డుకు ఆనుకోని ఉన్న కపిలతీర్థం ప్రాంతంలో జింకలు, దుప్పులు, కనితులు ఆహారం కోసం బయటకు వచ్చాయి. సాధు జంతువులు అటవీ ప్రాంతాన్ని విడి తిరుమల విదులోన్ను, తిరుపతికి సమీప అటవీ ప్రాంతంలోనూ బయటకు వస్తుండడంతో క్రూర మృగాలు వాటి ఆహార అన్వేషణకు సాధుజంతువులను వేటాడేందుకు అటవీ ప్రాంతం విడిచి జన సంచారం ఉన్న ప్రాంతంలో వచ్చి హల్ చల్ చేస్తూ హడాలేతిస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు.. భయం గుప్పిట్లో జనం..
జనసంచారం ఉన్న ప్రాంతంలోకి క్రూర మృగాల సంచారం ఇటు టిటిడి అధికారుల్లోనూ, స్థానికులలోను అటు తిరుమలకు వచ్చే భక్తులలోను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిరుతతో పాటు, ఎలుగు బంట్లు, రేసు కుక్కలు తిరుమలలోని జనసంచార ప్రాంతాల్లోకి రావడం టిటిడికి పెద్ద సమస్యగా మారింది..వన్య ప్రాణుల నుండి భక్తులకు రక్షణ కల్పించాల్సిన అటవీశాఖ నిద్రలోకి జారు కోవడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.. ఘాట్ రోడ్డులో ప్రయానించే భక్తులు కొన్ని జంతువులకు ఆహారం అందించడం, వాటితో ఫోటోలు దిగడం వంటివి భక్తులను సంతోషానికి కలిగిస్తున్నా అత్యంత ప్రమాదకరం..
భక్తులకు సూచిక బోర్డుల ద్వారా తెలియజేయాల్సిన టిటిడి ఫారెస్టు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం భక్తుల పాలిట శాపంగా మారింది..లాక్ డౌన్ తరువాత శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభించిన సమయంలో తిరుమల వస్తున్న ఉద్యోగిపై చిరుత దాడి చేయడం..టిటిడి ఉద్యోగులను, భక్తులను తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది..అంతే కాకుండా తిరుమల రింగ్ రోడ్డులో ఏకంగా మూడు చిరుతలు రాత్రి పూట రోడ్డుపై సంచరించడం స్ధానికులకు ఆందోళనకు గురిచేస్తోంది..అప్రమత్తంగా ఉండాల్సిన అటవీ శాఖ అధికారుల తీరు చేతులు కాలిన తరువాత ఆకు పట్టుకోవాలన్న సామెత సరిగ్గా సరి పోతుందన్నడంతో సందేహం లేదు..తిరుమలలో భక్తులు రద్దీ లేక పోవడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్న తరుణంలో భక్తుల భధ్రత ద్రుష్ట్యా అటవీ శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఏంతైనా ఉంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Animal Lovers, AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd