హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: మగ దూడపుడితే రూ.500.. ఏపీలో ఈ స్కీమ్ ఉందని మీకు తెలుసా..?

AP News: మగ దూడపుడితే రూ.500.. ఏపీలో ఈ స్కీమ్ ఉందని మీకు తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం (Photo Credit: Facebook)

ప్రతీకాత్మకచిత్రం (Photo Credit: Facebook)

చిన్నప్పుడు బడికెళ్లి చదువుకోకపోతే… బర్రెలుతోలుతావా అనే నానుడి పల్లెటూర్లలో ఉండేది. ఇప్పుడు అదే మాటలను నిజం చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్‌ కొందరు. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగాల కన్నా.., చిన్న పాడి పరిశ్రమ పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు.

ఇంకా చదవండి ...

  చిన్నప్పుడు బడికెళ్లి చదువుకోకపోతే… బర్రెలుతోలుతావా అనే నానుడి పల్లెటూర్లలో ఉండేది. ఇప్పుడు అదే మాటలను నిజం చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్‌ కొందరు. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగాల కన్నా.., చిన్న పాడి పరిశ్రమ పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు దానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుండటం వారికి మరింత ఊతమిస్తుంది. దీంతో కొందరు చదువుకున్న నిరుద్యోగులు.. శ్రేష్టమైన ఆవులతో ఆదాయం పొందాలనుకుంటున్నారు. పాడిపరిశ్రమ పెట్టాలనుకునేవాళ్లను ఏ దూడలు కావాలని అడిగితే ఆడ దూడలే అని టక్కున చెబుతారు. అటువంటి వారికి ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడనుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు ఇస్తున్న.., దానికి పుట్టేది మగదూడా.. ఆడదూడా అనేది ముందుగానే తెలియదు. కానీ ఇకపై ఆవుకు పెయ్యదోడలే పుట్టించుకునే సదుపాయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (Sorted sex semen)తో దాదాపు 95 శాతం ఆడ దూడలను అభివృద్ధి చేసుకోచ్చంటున్నారు నిపుణులు.

  ఆడ దూడల జననం ద్వారా పాల దిగుబడి పెరుగుతుంది. దాంతో రైతు ఆదాయాం కూడా పెరుగుతంది. ఈ లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా చేయడం వల్ల పాడిపరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే అధికారులు దీన్ని రైతులకు తెలిసేలా.. వాళ్లు సద్వినియోగం చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. పూణే, అహమ్మదాబాద్‌ల్లోని వెటర్నరీ రీసెర్చ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ వీర్యాన్ని ఆంబోతుల నుంచి సేకరించారు. లింగనిర్ధారణ వీర్యంతో ఆడదూడలే పుట్టే విధంగా వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్‌ఎఫ్‌ ఆవులతో ఈ ప్రయోగం చేశారు.

  ఇది చదవండి: ఇంటివెనక అంత జరిగితే పట్టించుకున్నారా..? చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్..


  దాదాపు 200 ఆవులకు ఇలాంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టగా..అందులో 47 ఆడదూడలే. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, హెచ్‌ఎఫ్‌ ఆవులకు కూడా కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్‌లు వేస్తారు. ఒక్కో డోసు పూర్తి ధర ఏడువందల రూపాయలు ఉండగా... అందులో కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు కేవలం రూ.250 చెల్లిస్తే చాలు.

  ఇది చదవండి: ఏపీలో వర్షాలు తగ్గుతాయా.? పెరుగుతాయా..? తాజా అప్ డేట్ ఇదే..!


  మూడు సార్లు వేసే అవకాశం..!

  ఈ లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసులు ఇచ్చే అవకాశం ఉంది. గేదెలు, ఆవులు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు ఇంజక్షన్ చేయాలి. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే.. రెండోసారి వేయోచ్చు. ఒకవేళ రెండోసారి కూడా చూడికట్టకపోతే మూడోసారి వేయోచ్చు.

  గర్భదారణ కాకపోయినా, మగదూడ పుట్టినా రూ.500 వెనక్కి..!

  ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. మూడు డోసులు వేసినా ఆవు, గేదె గానీ సూడికట్టకపోతే రూ.500 రైతుకు తిరిగిచేస్తారు. అంతేకాదు ఈ సార్టెడ్‌ సెక్స్‌ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ మూడు డోసులు వేసినా… మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. ఈ ఏడాది కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh

  ఉత్తమ కథలు