ఏపీలో స్విగ్గీ సేవల విస్తరణ...యువతకు ఉపాధి అవకాశాలు

ఏపీలో మరో రెండు నగరాలకు స్విగ్గీ తన సేవలను విస్తరించింది. త్వరలోనే మరికొన్ని నగరాలకు సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

news18-telugu
Updated: January 22, 2019, 10:08 AM IST
ఏపీలో స్విగ్గీ సేవల విస్తరణ...యువతకు ఉపాధి అవకాశాలు
స్విగ్గీ
news18-telugu
Updated: January 22, 2019, 10:08 AM IST
రాజమండ్రి, కాకినాడ భోజన ప్రియులకు గుడ్ న్యూస్. నెట్‌లో లేదా మొబైల్ యాప్‌లో బుక్ చేస్తే ఇక మీరున్నచోటికే తినుబండారాలు వచ్చి చేరుతాయి. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఏపీలో తన సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సేవలను ప్రారంభించింది. దీని కోసం ఆ నగరాల్లోని పలు హోటళ్లతో స్విగ్గీ ఒప్పందాలు చేసుకుంది.  దీంతో ఏపీలో స్విగ్గీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే విజయవాడ, వైజాగ్‌, గుంటూరులో స్విగ్గీ సేవలు అందిస్తోంది. ముందు ముందు మరిన్ని నగరాలకు స్విగ్గీ సేవలు విస్తరించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రాజమండ్రి, కాకినాడల్లో ప్రజలకు చేరువచ్చేందుకు స్విగ్గీ ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించింది. మరెందుకు ఆలస్యం మీరు రాజమండ్రి, కాకినాడలోనే ఉంటే స్విగ్గీ యాప్‌లో మీకిష్టమైన తినుబండారాలను ఒకసారి ట్రై చేయండి.

స్విగ్గీలో ఉపాధి అవకాశాలు

రాజమండ్రి, కాకినాడల్లో స్విగ్గీ సేవలను ప్రారంభించడంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. పలు హోటళ్ల నుంచి ఆహారాన్ని స్విగ్గీ వినియోగదారులకు చేరవేస్తోంది. ముందు ముందు మరిన్ని హోటళ్లకు ఈ సేవలను విస్తరించే అవకాశముంది. స్థానిక యువకులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు స్విగ్గీని సంప్రదించవచ్చు.

First published: January 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...