ఏపీలో SSC, Inter పరీక్షలు, ఫలితాలు వెల్లడించే తేదీలు ఇవే

ఏపీలో పదో తరగతి, ఇంటర్ సహా పలు ముఖ్యమైన పరీక్షలు నిర్వహించే తేదీలు, వాటి ఫలితాలను విడుదల చేసే తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

news18-telugu
Updated: February 12, 2019, 12:55 PM IST
ఏపీలో SSC, Inter పరీక్షలు, ఫలితాలు వెల్లడించే తేదీలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 12:55 PM IST
ఏపీలో పలు కీలక ప్రవేశ పరీక్షలు, వాటి ఫలితాలను వెల్లడించే తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.  పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 27న వెల్లడిస్తామని వివరించారు. విశాఖలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి...మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,623 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. మొత్తం 2,838 పరీక్షా  కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు  వివరించారు.  పదో తరగతి ఫలితాలు ఏప్రిల్‌ 27న విడుదల చేస్తామన్నారు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. ఇంటర్‌ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.  మొత్తం 1430 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏప్రిల్‌ 12న ఇంటర్‌ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని మంత్రి గంటా వెల్లడించారు.

ప్రవేశ పరీక్షల తేదీలు..ఏప్రిల్‌ 19న ఏపీ ఈసెట్‌.. మే 30న ఫలితాలు

ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్‌ పరీక్షలు.. మే 1న ఫలితాలు

ఏప్రిల్‌ 26న ఐసెట్‌.. మే 3న ఫలితాలు వెల్లడి

మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్‌ పరీక్షలు.. మే 11న ఫలితాలు

మే 6న ఏపీ ఈడీసెట్‌.. మే 10న ఫలితాలు

మే 6న ఏపీ లాసెట్‌ పరీక్షలు.. మే 13న ఫలితాలు

మే 6 నుంచి 15 వరకు ఏపీ పీఈసెట్‌.. మే 25న ఫలితాలు
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...