హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Undavalli Comments: చంద్రబాబును అంతమాట అంటారా..? ఏపీ సర్కార్ కు ఉండవల్లి హెచ్చరిక..

Undavalli Comments: చంద్రబాబును అంతమాట అంటారా..? ఏపీ సర్కార్ కు ఉండవల్లి హెచ్చరిక..

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavlli Hot comments on YS Jagan:వైఎస్ఆర్ కి అత్యంత ఆప్తుడు.. వైఎస్ జగన్ కు సన్నిహితుడు.. చంద్రబాబు అంటే అంత ఎత్తున లేచే.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన ఆయన.. జగన్ ప్రభుత్వానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు..

ఇంకా చదవండి ...

Undavalli Arun kumar warns to AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో ప్రస్తుతం నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అంశం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ (AP Assembly) వేదికగా.. రాజకీయాలతో సంబంధం లేని తన భార్య నారా భువనేశ్వరిని కించపరుస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తూ.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టేది అని శపథం చేశారు.. ఆ తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భార్యను అనడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో చంద్రబాబుకు రాజకీయ నేతలు, ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. మరోవైపు వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం చంద్రబాబు డ్రామాను ప్రజలెవ్వరూ నమ్మరని విమర్శిస్తున్నారు. భార్యను కూడా రోడ్డుపై లాగిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వ్యవాహరంపై రాజమండ్రి మాజీ ఎంపీ.. వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kuamar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చెప్పాలి అంటే సీఎం జగన్ సర్కార్ కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు..

అసెంబ్లీలో జరిగిన ఘటనను ఉండవల్లి తప్పు పట్టారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి తానెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు అన్నారు. అలాగే హరికృష్ణ, పురందేశ్వరితో తనకు పరిచయం ఉందని గుర్తు చేశారు. వాళ్లు చాలా మంచివారని కితాబు ఇచ్చారు. అయినా చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ డ్రామా అనుకుంటే మన రాష్ట్రంలో సింపతి.. అది కూడా ప్రస్తుతం ఎలాంగి ఎన్నికలు కూడా లేవు.. ఇలాంటి సమయం సింపతీ పని చేయదని చంద్రబాబుకు తెలియదా అని ఉండవల్లి ప్రశ్నించారు. అయితే చంద్రబాబు అంతలా స్పందించాల్సిన సమస్య కానేకాదు అన్నారు.

ఇదీ చదండి : ఏపీ ప్రభుత్వం పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయిందని. అసెంబ్లీ లాంటి వేదికపై నేతలు చాలా హుందాగా మాట్లాడాలి అన్నారు. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారని ప్రశ్నించారు.. విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అన్నారు. ఏ రాష్ట్రంలో అయినా విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.. పాటలు పాడారు అంటూ ఉండవల్లి సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే గతంలో ఎప్పుడూ సీఎం వైఎస్ జగన్‌పై పెద్దగా కామెంట్స్ చేయ లేదు.. కాస్త అటు ఇటుగా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. కానీ ఇటీవల జగన్ సర్కార్ తీరును ఉండవల్లి తప్పు పడుతూ వస్తున్నారు.

ఇదీ చదండి : మిషన్ 2024పై ఫోకస్.. చంద్రబాబు బస్సు యాత్ర.. చిన్నబాబు పాదయాత్రలతో భారీ వ్యూహం

మరోవైపు రాష్ట్రం చేస్తున్న అప్పులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయని, గడిచిన రెండేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం 3 లక్షలకు పైబడి అప్పులు చేసిందని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రభుత్వ పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Undavalli Arun Kumar

ఉత్తమ కథలు