• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRAPRADESH POLICE SEIZED 130 CASES OF ALCOHOL WHICH IS TRANSPORT FROM TELANGANA IN ILLEGAL WAY MS

తెలంగాణ నుంచి ఏపీకి ఆగని మద్యం అక్రమ రవాణా.. గుంటూరులో 130 కేస్ ల లిక్కర్ పట్టివేత..

తెలంగాణ నుంచి ఏపీకి ఆగని మద్యం అక్రమ రవాణా.. గుంటూరులో 130 కేస్ ల లిక్కర్ పట్టివేత..

పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

ఎన్ని సార్లు పట్టుకున్నా.. కేసులు పెట్టి మందలించినా.. ‘మీపని మీదే మా పని మాదే’ అన్న చందంగా మారింది అక్రమార్కుల తీరు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 130 కేసుల అక్రమ మద్యాన్ని పోలీసులు గుంటూరు లో పట్టుకున్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    తెలుగు రాష్ట్రాల సరిహద్దుల మధ్య మద్యం ఏరులై పారుతున్నది. ఆంధ్రలో మద్యనిషేధం అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని సరఫరా చేస్తున్నారు అక్రమార్కులు. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకున్నా.. కేసులు పెట్టినా.. వారిలో మార్పు రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పోలీసులు భారీ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న సమయంలో మాటు వేసి.. వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా పోలీసుల కళ్లుగప్పడానికి మద్యం రవాణా చేసే అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.

    ఎన్ని సార్లు పట్టుకున్నా.. కేసులు పెట్టి మందలించినా.. ‘మీపని మీదే మా పని మాదే’ అన్న చందంగా మారింది అక్రమార్కుల తీరు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 130 కేసుల అక్రమ మద్యాన్ని పోలీసులు గుంటూరు లో పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ సుమారు రూ. 15 లక్షల దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు.



    అయితే ఈ మద్యం సీసాల కేసులను.. దాచేపల్లి మండలం లోని అలుగుమిలిపాడు గ్రామ సమీపంలో ఉన్న క్వారీ గుంతలో నిల్వచేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక్కడ 72 కేసుల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు గురజాల డిఎస్పి జయరామ్ ప్రసాద్ తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు