ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనివేళల్లో మార్పులు చేస్తూ ఏపీ హైకోర్టు రిజిస్టర్ జనరల్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ప్రతీ రోజు ఉదయం 10.30గం. నుంచి మధ్యాహ్నాం 1.30గం. వరకు హైకోర్టు నడవనుంది. మధ్యాహ్నాం 2.15గం. వరకు భోజన విరామం. తిరిగి మధ్యాహ్నాం 2.15గం. నుంచి సాయంత్రం 4.15గం. వరకు కోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్చి 28వ తేదీ నుంచి కొత్త పనివేళలు అమలులోకి వస్తాయి.
ఇదిలా ఉంటే, అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఫిబ్రవరి 3న ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోంది. సీజేఐ రంజన్ గొగొయ్ను ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.