జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme )కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ(జనవరి 30,2023)మంజూరు చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జరిగే బహిరంగ సభలో జగనన్న చేదోడు పథకం కింద 3.30 లక్షల మంది లబ్ధిదారులకు వరుసగా మూడో ఏడాది ఆర్థిక సాయం అందించనున్నారు. అందులో భాగంగా చేతి వృత్తిదారులు అంటే దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మ ణుల బ్యాంకు అకౌంట్లలో రూ.10 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. జగనన్న చేదోడు పథకం కింద దుకాణాలు ఉన్న 1,67,951 మంది టైలర్లకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ.167.95 కోట్లు, దుకాణాలు ఉన్న 1,14,661 మంది రజకులకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ.114.67 కోట్లు, దుకాణాలు ఉన్న 47,533 మంది నాయీబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ47.53 కోట్లు అందజేస్తారు.
ఈ పథకానికి అర్హత పొందాలంటే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మీ–సేవ కేంద్రాల్లో వాటిని పొందేవారు. ఇప్పుడు ఏపీ ఈ–సేవ ద్వారా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీనివల్ల ఆధార్ కార్డుతో అనుసంధానమై కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ మేరకు లింక్ ఇచ్చారు. అయితే తొలుత ఈనెల 24, 25,26 తేదీల్లో మూడు రోజులే గడువు ఇవ్వడంతో పత్రాలు సమర్పించలేకపోయారు. దీంతో ఆ తర్వాత మరోరోజు గడువు పెంచారు.
Tirumala: ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? మీ కోసమే ఈ కీలక అప్‌డేట్
ఈ పథకం కింద ఇప్పటివరకు, రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో 2,98,122 మందికి ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 298.12 కోట్లు,2021-22లో 2,99,116 మందికి రూ.299.12 కోట్లు, 2022-23లో 3,30,145 మందికి రూ. 330.15 కోట్లు అందించింది, ఈ విధంగా పంపిణీ చేయబడిన మొత్తం నేడు అందిచనున్న మొత్తంతో కూడా కలిపి రూ.927.39 కోట్లకు చేరుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap cm ys jagan mohan reddy, Cm jagan, Money