హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అలా చేస్తే ఊరుకునేది లేదు.. మేం అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తాం.. ఏపీ సీఎంపై దేవినేని ఉమ ఫైర్

అలా చేస్తే ఊరుకునేది లేదు.. మేం అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తాం.. ఏపీ సీఎంపై దేవినేని ఉమ ఫైర్

దేవినేని ఉమ, జగన్ (ఫైల్)

దేవినేని ఉమ, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతున్నదని.. రైతులపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (devineni uma) అన్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడి గురించి ఆయన స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (ap cm jagan)పై ఆయన విరుచుకుపడ్డారు.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (jaganmohan reddy) అనుసరిస్తున్న విధానాలపై ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (devineni uma maheshwararao) మరోసారి ఫైర్ అయ్యారు.  ఏపీలో జగన్ ఆదేశాలతో అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెడితే తమ ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని దేవినేని ఉమ  అన్నారు. ప్రతిపక్ష నాయకులకు సెక్యూరిటీ తొలగించి, అక్రమ కేసులతో కుట్రలు పన్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతులు అధైర్యపడవద్దని.. వారికి అండగా తాము ఉంటామని చెప్పారు. ‘రాముడు మనతో ఉన్నాడు, న్యాయం జరిగి తీరుతుంద’ని స్పష్టం చేశారు. గురువారం రాజధాని ప్రాంతంలోని మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతు శిబిరంలో గత 387 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలియజేశారు.

  అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పబ్బంగడుపుకొని రాజధాని విషయంలో నిలువునా మోసం చేసి మడమతిప్పాడని ఆరోపించారు. 387 రోజులుగా మొక్కవోని దీక్షతో రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారని.. వారి ధైర్యానికి, తెగువకు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఈ పోరాటంలో 117 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని గుండె ఆగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఏపీలో వైసీసీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లోనే రూ. 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ సొమ్మును పప్పు బెల్లాల్లా తినేసారని ఆరోపణలు చేశారు.

  ఇంకా ఆయన స్పందిస్తూ...  ‘దీక్షలు మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు రెండు సంక్రాంతులు, రెండు క్రిస్మస్ లు పూర్తి చేసుకుంటున్నాం. రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారిపై బౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. మహిళలను బాధపెట్టినా ఇంత పెద్ద ఎత్తున స్త్రీలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంటి ముందే మంత్రులు బూతులు మాట్లాడుతూ.. పేకాట ఆడతాం ఏం పీకుతారు...? అంటూ మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం అవుతుంది..’ అన్నారు.

  ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టి రాక్షసంగా ఆటవికంగా పరిపాలన సాగుతూ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేవాలయలపై చేసే దుర్మార్గమైన దాడులే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడేట్టు చేస్తాయని ఈ సందర్భంగా ఉమ వ్యాఖ్యానించారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Amaravathi, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Devineni uma, Devineni Uma Maheswara Rao, Farmers Protest

  ఉత్తమ కథలు