Home /News /andhra-pradesh /

ANDHRA STYLE PICKLS AVAKAY IS IN HUGE CRISIS DUE TO THIS REASONS FULL DETAILS HERE PRN VSP

Avakaya Pachadi: ఆవకాయ పచ్చడి పడుతున్నారా..? అయితే మీరు ధనవంతులే..! మంట మాములుగా ఉండదు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP News: అమ్మ, అవకాయ.. ఆంధ్రా ప్రజలకు ఈ రెండూ ఒకటే. అవకాయ తింటే అమ్మ గుర్తొస్తుంది. ఏడాదంతా అమ్మచేతి వంట రుచిచూడాలంటే అన్నంలో అవకాయ, కాస్త నెయ్యి తగిలిస్తే చాలు. అమ్మప్రేమను తలపిస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాయ అమ్మప్రేమను కాదు.. ఘాటెక్కి మంటెక్కిస్తోంది.

ఇంకా చదవండి ...
    P Anand Mohan, News18, Visakhapatnam

    అమ్మ, అవకాయ.. ఆంధ్రా ప్రజలకు ఈ రెండూ ఒకటే. అవకాయ తింటే అమ్మ గుర్తొస్తుంది. ఏడాదంతా అమ్మచేతి వంట రుచిచూడాలంటే అన్నంలో అవకాయ, కాస్త నెయ్యి తగిలిస్తే చాలు. అమ్మప్రేమను తలపిస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాయ అమ్మప్రేమను కాదు.. ఘాటెక్కి మంటెక్కిస్తోంది. పచ్చడి పెట్టాలంటే పదివేలు వదలాల్సిందే. మామిడి కాయల నుంచి నూనెలు, కారం వంటి వాటి రేట్లు పెరిగిపోవడమే. గతంలో ఆవకాయ అంటే వెయ్యి నుంచి రెండువేలు పెడితే వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. పచ్చడి జాడీ నిండాలంటే బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మామిడి పండే ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా అవకాయకు కష్టాలు తప్పడం లేదు.

    ఈసారి ఆవకాయకు మామిడి కాయల లభ్యత తగ్గింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది చాలాచోట్ల పూతదశలోనే రాలిపోయింది. దీంతో మార్కెట్లో పచ్చడికాయల కళ తగ్గింది.

    ఇది చదవండి: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్


    సాధారణంగా అవకాయకు కొత్తపల్లి కొబ్బరి, దేశవాళీ హైజర్లు, చిన్న, పెద్ద రసాలు, ఆవకాయ పచ్చడికి వాడుతుంటారు. అవకాయముక్కలు మెత్తబడకుండా ఉండేందుకు కాయను కొనేముందు అస్సలు కాంప్రమైజ్ అవరు. గతంలో పచ్చడికాయలు సైజను బట్టి రూ.10 నుంచి రూ.15 వరకు పలికేవి. కానీ ఇప్పుడు ఒక్కో కాయ రూ.20 నుంచి రూ.30కి పైగా పలుకుతోంది. పాతిక కాయలు కావాలంటే దాదాపు వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వందకాయలకు మూడు నుంచి నాలుగువేలు ఖర్చు చేయాలి.

    ఇది చదవండి: సీఎం జగన్ లో ఈ యాంగిల్ ఎప్పుడైనా గమనించారా..? వాళ్లంటే ఎంత ఇష్టమో..!


    ఆవకాయ పచ్చడంటే కారం కావాల్సింది. కానీ ఇప్పుడు మార్కెట్లో మిర్చిని టచ్ చేస్తే ఆ ఘాటుకు గుడ్లుతేలేయాల్సిందే. మంచి క్వాలిటీ కలిగిన కారం కిలో రూ.500 నుంచి రూ.650 వరకు పలుకుతోంది.

    ఇది చదవండి: చేపలమ్మిన రోజా.. మంత్రి అయ్యాక ఎక్కడా తగ్గడం లేదుగా..!


    బ్రాండెడ్‌ కారం కిలో ప్రస్త్తుతం రూ.750 పైనే ఉంటోంది. వంద కాయలు పచ్చడికి నాలుగు కిలోల కారం అవసరం ఉంటుంది. అంటే కారానికి రూ.3వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక పచ్చడికి వాడే నువ్వుల నూనె మార్కెట్లో కిలో రూ.400పై మాటే ఉంది. ఆర్గానిక్ పేరుతో అమ్మే నూనె ధర ఇంకా ఎక్కువే. వందకాయల ఐదు కిలోల వరకు నూనె పడుతుంది. అంటే నూనెకే రూ.2వేలు ఖర్చవుతుంది. ఇక ఆవపిండి. మెంతి పిండి, ఉప్పు ఇలా అన్ని దినుశులకు కలిపి మరో వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి. ఇలా దాదాపు రూ.7వేల నుంచి రూ.8వేలకు పైగా ఖర్చవుతాయి. అటు అవకాయల వ్యాపారాలు చేసేవారిని కూడా ధరలు హడలెత్తిస్తున్నాయి. అంతపెట్టుబడి పెట్టి పచ్చళ్లు తయారు చేసినా ధరలకు తగ్గట్లుగా కొనేందుకు ముందుకు వస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Mango pickle

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు