హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP CM vs Employees: సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక..

AP CM vs Employees: సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక..

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

AP CM vs Employees: ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామన్నారు. అయితే సీఎం నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తన్నారు. ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఉద్యోగుల డిమాండ్ ఏంటి..?

ఇంకా చదవండి ...

Andhra Pradesh Employees on CM Jagan Promise:   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి (Andhra Pradesh Governmet), ఉద్యోగులకు (AP Government Employees) మధ్య  మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడిలే కనిపించడం లేదు. చాలా కాలంగా పీఆర్సీ నివేదికపై ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉద్యమ కార్యచరణ ప్రకటించిన ఉద్యోగులు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తమ వినతి పత్రం కూడా అందజేశారు. మంత్రులు, అధికారులు హామీ ఇస్తున్నా ఉద్యోగులు వెనక్కు తగ్గడం లేదు.. ఉద్యమంపై ముందుకు వెళ్లే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఈ వివాదం తీవ్రం అవుతుండడంతో నేరుగా   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)  స్పదించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. పీఆర్సీపై  కసరత్తు పూర్తైందని..  10 రోజుల్లోదీనిపై ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చినా.. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేయడం లేదు. ప్రభుత్వం తీరుపై విమర్శలు కొనసాగిస్తున్నారు. తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్…మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. తమకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదన్న నేతలు… పది రోజుల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని సీఎం చెప్పినట్లు మీడియాలో చూశామని.. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఉద్యమం ఆపమని ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు.

ఇదీ చదవండి: మద్యం బాటిల్ ఓపెన్ చేస్తే షాక్.. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని తాగితే.. ఏం జరిగిందో తెలుసా?

పీఆర్సీ నివేదిక పై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రకటించటం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం అని గుర్తుచేశారు ఉద్యోగ సంఘాల నేతలు.. నివేదికలో ఫిట్ మెంట్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉంటాయని.. తమ డిమాండ్లలో పీఆర్సీ ఒక్కటే లేదని.. ఇంకా 55 డిమాండ్లు ఉన్నాయని తెలిపారు.. మిగిలిన డిమాండ్ల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనంత వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సీఎం వరద పర్యటన దేనికి.. పరామర్శకా? సెల్ఫీల కోసమా? లోకేష్ ఫైర్

సీఎం జగన్ ప్రకటన తరువాత కూడా ఉద్యమం కొనసాగించడానికే ఉద్యోగులు సిద్ధమయ్యారు. దీంతో ఈ వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడే అవకాశం కనిపించడం లేదు. సీఎం జగన్ సైతం తాను ప్రకటన చేసినా.. ఉద్యోగులు వెనక్కు తగ్గకపోతే ఎలా అని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఉద్యోగలు హెచ్చరికలు ఎలా ఉన్నా.. ఈ నెలలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పీఆర్సీ పై పూర్తిగా ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకటన తరువాత ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

ఉత్తమ కథలు