Vat On Liquor in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (andhra pradesh government) అంటేనే మందుబాబులు (Liquor lovers) మండిపడుతున్నారు.. మద్యం నిషేధం పేరు చెప్పి.. వైన్ షాపులను (Wine shops) తగ్గించేశారు.. రేట్లు పెంచితే మందు తాగే వారి సంఖ్య తగ్గుతుంది అంటూ బారీగా ధరల (High Rates)ను పెంచింది ప్రభుత్వం. అయినా మందుబాబులు నో అంటూ అదే స్థాయిలో మద్యం సేవిస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా మంచి బ్రాండ్ లు అందుబాటులో ఉండడం లేదన్నది మందు తాగే వారి ప్రధాన డిమాండ్. చెత్త చెత్త బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది లిక్కర్ లవర్స్ కు.. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌లో మార్పు చేస్తూ ఎక్సైజ్ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది.
తాజా నిర్ణయం ప్రకారం 400 రూపాయల లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించింది. అదే 400 నుంచి 2,500 ధర ఉన్న మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. అలాగే 2,500-3,500 ధర వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్ విధించింది. ఇక 3,500 నుంచి 5,000 విలువ ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్ ఉండనుంది. 5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్ కేసుపై 200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్ వేయనున్నారు.
ఇక 200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. రెడీ టు డ్రింక్లపైన కూడా 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ప్రభుత్వం నిర్ణయంతో మద్యం రేట్లు మరింత పెరుగుతాయని మందు బాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ఆగర్భ శత్రువుల ఆలింగనం
ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చెత్త బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని.. ఇప్పుడు మరింత దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ వైపు నిత్య అవసరమైన పెట్రోల్ రేట్లను తగ్గించడం లేదని.. ఇదే సమయంలో ఎక్కువ ఆదాయం వస్తున్న మద్యం పై ఇలా బాదుడు విధించడం ఏంటని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Liquor, Wine shops