Andhra Pradesh: సంక్రాంతి వేడుకల్లో రికార్డిండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్.. డ్యానర్లతో కలిసి చిందేసిన వైసీపీ నాయకులు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాల పేరుతో కొందరు అశ్లీల కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల రికార్డిండ్ డ్యాన్స్‌లు, అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో, పిండి వంటలతో ప్రజలు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు.. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సరదాగా గడిపారు. వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. గ్రామాల్లో హరిదాసులు కీర్తనలు మారుమోగాయి. మరోవైపు కోడి పందేలు కూడా జోరుగా సాగాయి. అయితే సంక్రాంతి సంబరాల పేరుతో కొందరు అశ్లీల కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల రికార్డిండ్ డ్యాన్స్‌లు, అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు జిల్లాలో కొందరు అధికార వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా.. డ్యాన్సర్లతో కలిసి చిందేశారు. వివరాలు.. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొందరు వైసీపీ నాయకులు రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు.

    రికార్డింగ్ డ్యాన్స్‌లు జరుగుతున్న సమయంలో పలువురు వైసీపీ నాయకులు.. డ్యాన్సర్లతో కలిసి చిందేశారు. లేడి డ్యాన్సర్ల మధ్యలో నిల్చుని వారితోపాటుగా కాలు కదిపారు. అయితే ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నప్పటికీ పోలీసులు మాత్రం చర్యలు తీసులేకపోతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: