రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇవాళ ఒకటో తేదీ కావడంతో...రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.68 మంది వాలంటర్లు..ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో వాలంటీర్లు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా వారి చేతికే పెన్షన్‌ను అందిస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు దాదాపు 16 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. అంటే మొత్తం అర్హుల్లో 26 శాతం మందికి పెన్షన్లు పంపిణీ జరింది. బయోమెట్రిక్‌తోనే పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం రూ.1496.07 కోట్లు విడుదల చేసింది. ఈ నెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్‌ను అందించనుండగా...కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
పెన్షన్ లబ్ధిదారులు ఆస్పత్రుల్లో ఉంటే..వాలంటీర్లు వారి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ysr pension scheme