• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH YS JAGANMOHAN REDDY VISIT IN VIZIANAGARAM DISTRICT SENSATIONAL COMMENTS ON HOUSE PATTAS BA GNT

YS Jagan: ఒక్కొక్కరికి రూ.8 లక్షల ఆస్తి.. 2020 ముగిసే ముందు సీఎం జగన్ సంచలన కామెంట్స్

YS Jagan: ఒక్కొక్కరికి రూ.8 లక్షల ఆస్తి.. 2020 ముగిసే ముందు సీఎం జగన్ సంచలన కామెంట్స్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని నెమరు వేసుకునే అవకాశం వొచ్చిందన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని నెమరు వేసుకునే అవకాశం వొచ్చిందన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చితే జగన్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోడాని చాలా చేశానని చెప్పారు. పేదలు, రైతులు, అవ్వ తాతలు, వందల సామాజిక వర్గాలకు ఉపయోగపడ్డాను అని గర్వంగా చెపుకుంటున్నానన్నారు. 87 లక్షలకు పైగా అక్క చెల్లెలు కి ఆసరా ద్వారా లబ్ధి చేకూర్చానని అన్నారు. 62 లక్షలకుపైగా మందికి ప్రతినెలా ఇంటికొచ్చి పింఛను ఇవ్వగలిగే లా చేశామన్నారు. అలాగే, 18.50 లక్షల మంది కి విద్యాదీవెను అందించామన్నారు. సున్నా వడ్డీ పథకం, రైతులకు ఇన్సూరెన్స్ సీజన్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడానికి గర్వంగా ఉందన్నారు. 1.30 కోట్ల పేదలకు ఆరోగ్యశ్రీ, 1.30 లక్షల మందికి ఉద్యోగాలు సచివాలయం ద్వారా ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నానన్నారు. నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారుతున్నాయన్నారు. స్కూల్ లు, ఆసుపత్రులు వస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల హామీలు 18 నెలల్లో 95 శాతం పూర్తి చేయగలిగామన్నారు.

    సంక్రాంతి ముందుగా చెప్పినట్టు ఆస్తిని, స్థిరాస్థిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. 28 లక్షల ఇల్లు కడుతున్నామన్నారు. గుంకలంలో లే అవుట్ లో ప్రస్తుతం భూమి విలువ ప్రభుత్వ విలువ రూ.3 లక్షలు ఉంటుందని, ఇల్లు పూర్తి చేసి పేదలకు ఇస్తే సుమారు రూ.8 లక్షల ఆస్తిని ఇచ్చినట్టవుతుందన్నారు. లే అవుట్ సైజును బట్టి ఇక్కడే విద్యుత్ సబ్ స్టేషన్, బ్యాంకులు, ఏటీఎంలు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, క్లినిక్‌లు, రైతుబజార్లు, పోస్టాఫీస్ లు, బల్క్ మిల్క్ స్టోరేజ్ లు, పార్కులు, శ్మశానాలు, ఇలా అన్నీ ఇక్కడే వస్తాయని చెప్పారు. ఇక్కడ ఒక నగర పంచాయతీ నే ఏర్పడబోతోందన్నారు.

    సంపాదించే దానిలో 40శాతం ఇంటి అద్దెకు పోతున్న పరిస్థితిని తాను పాదయాత్రలో చూశానని జగన్ అన్నారు. అప్పుడే పూరిగూడేసే లేకుండా చేయాలని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇవ్వగలనని నిర్ణయించుకున్నానన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పారు. బాధ్యతగా హామీలు నెరవేర్చుతున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల పేర్లు ప్రదర్శించి పారదర్శకత తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం అక్కడక్కడ ఇల్లు కట్టి ఇచ్చి ఉండొచ్చు కానీ, తమ ప్రభుత్వం ఊర్లను, పట్టణాలను, నగరాలను నిర్మిస్తోందన్నారు. కోటి 24 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని జగన్ అన్నారు. ఒక స్థలం మాత్రమే కాదు, ఇల్లు కట్టిస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

    ఆంధ్రప్రదేశ్లో 30.7 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి డిసెంబర్ 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజు శ్రీకారం చుట్టింది. దీన్ని 10 రోజుల పాటు పండుగలా నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పట్టాల పంపిణీ చేపడుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: