హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister on chandrababu: చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఈ ఎన్నికల్లో ప్రజలు గుడ్ బై చెప్పనున్నారు

Minister on chandrababu: చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఈ ఎన్నికల్లో ప్రజలు గుడ్ బై చెప్పనున్నారు

చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్లు

చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్లు

Minister on chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే మొన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దుమారం మాట్రం ఆగడం లేదు. తాజాగా ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Minister on chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తే.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District) పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై దుమారం మాత్రం ఆగడం లేదు. ఆయన ఏమన్నారంటే..? తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తాను సీఎంగా గెలిచిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పానని.. ఎందుకంటే అసెంబ్లీలో తనపైనా.. తన భార్యపైనా అసభ్యకరంగా మాట్లాడరని.. అందుకే కౌరవ సభను గౌరవ సభగా మార్చాలి అంటే టీడీపీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఈ సారి టీడీపీ (TDP) ని ఎన్నికల్లో గెలిపించకపోతే.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి.. రెండు రోజులు దాటినా.. దుమారం ఆగడం లేదు. చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు..

తాజాగా చంద్రబాబు కామెంట్లపై స్పందించిన ఉషశ్రీ చరణ్.. వంచనకు మరోపేరు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్‌ అయ్యారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారని.. అందుకే ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వైఖరి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అని మండిపడ్డ ఆమె.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారని జోస్యం చెప్పారు.

ప్రతిపక్ష నేతకు జెండా, అజెండా రెండూ లేవు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందనే చంద్రబాబులో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోందన్నారు. 2014-19లో కురుబా (కురుమ) వర్గానికి ఎందుకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడే కురుబా వర్గం చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు వస్తోందని మండిపడ్డారు ఆమె. అలాగే డ్వాక్రా సంఘాలు మన దేశంలో మొదటి సారి 1982లో ఏర్పడ్డాయని.. టీడీపీ పెట్టక ముందు నుంచే డ్వాక్రా సంఘాలు ఉంటే.. చంద్రబాబు మాత్రం తానే ఈ సంఘాలను తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని సెటైర్లు వేశారు.

ఇదీ చదవండి : బీజేపీ నేతల వ్యాఖ్యలకు జనసేన పంచ్.. పుకార్లు నమ్మొద్దు.. పవన్ కు మోదీ చెప్పింది ఇదే..

విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తన పేరు ప్రస్తావించారని చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతిగా పేర్కొన్నారు. ఇళ్ల విషయంలో అబద్దాలు ప్రచారం చేయాలని జనసేన చేసిన ప్రయత్నాన్ని మహిళలే తిప్పికొట్టారని తెలిపారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు పని అయిపోయిందని.. ఇక, ఈ ఎన్నికల్లో ఆయన్ను కాపాడేవాడే లేరని.. ప్రజలు ఇప్పటికే ఆయనకు బైబై చెప్పాలని ఫిక్స్ అయ్యారని ఎద్దేవ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu

ఉత్తమ కథలు