ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీకే రమామణి కన్నుమూశారు.

news18-telugu
Updated: May 28, 2020, 10:44 PM IST
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి కన్నుమూత
టీకే రమామణి (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీకే రమామణి కన్నుమూశారు. ఒంట్లో నలతగా ఉందని ఆమె గురువారం గుంటూరులోని సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రమామణి మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. 56 ఏళ్ల రమామణి వాణిజ్య పన్నుల శాఖ లో కార్యదర్శి గా పని చేశారు. అనంతపురం జాయింట్ కలెక్టరుగా పని చేసి విజయవాడకు బదిలీ అయ్యారు. గుంటూరు పండరి పురంలో ఆమె బంధువుల ఇంటికి గత రాత్రి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రమామణి మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హుటాహుటిన వచ్చారు. రమామణి పార్ధీవదేహన్నీ ప్రవీణ్ ప్రకాష్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ప్రశాంతి, ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ లు శ్రీకాంత్, తాత మోహన్ రావు, డీయస్ఓ టి.శివరామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. రమామణి భర్త మురళీమోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. రమామణి తండ్రి టీకేఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. శాసనసభ్యులుగా వ్యవహరించారు. ఆమె కర్నూలు జిల్లా నంద్యాలలో జన్మించారు.
First published: May 28, 2020, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading