హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం దాల్చిన మహిళ... డెలివరీ రోజున అంతా షాక్..

Andhra Pradesh: మగపిల్లాడి కోసం మూడోసారి గర్భం దాల్చిన మహిళ... డెలివరీ రోజున అంతా షాక్..

చిత్తూరు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

చిత్తూరు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

Andhra Pradesh: సాధారణంగా ఒక కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం తరచు మనం చూస్తుంటాం. ఒకే కాన్పులో ఇద్దరికన్నా ఎక్కువగా కంటే అది ఎంతో అరుదు.

  సాధారణంగా ఒక కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం తరచు మనం చూస్తుంటాం. ఒకే కాన్పులో ఇద్దరికన్నా ఎక్కువగా కంటే అది ఎంతో అరుదు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురికి ప్రాణం పోసింది గుర్రం కొండకు చెందిన స్వర్ణలత. గుర్రంకొడకు చెందిన శివకుమార్-స్వర్ణలతకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇదివరకే ఇద్దరు కుమార్తెలున్నారు. మూడవ సారి గర్భం దాల్చిన స్వర్ణలతకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం ఉదయం 108 వాహనం ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గ మధ్యలో అంబులెన్స్ లోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి చేరుకోగానే మరో ఇద్దరు ఆడపిల్లలను ప్రసవించింది. సాధారణంగా మొదటికాన్పులోనే ఇలా ముగ్గురు కవలలు జన్మిస్తారని.. మూడవ కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం మాత్రం చాల అరదని వైద్యులు చెప్తున్నారు.

  గత నెల 7న నెల్లూరు జిల్లా, గూడురు పట్టణంలోని మైథిలీ ప్రైవేట్ హాస్పిటల్ పూజ అనే గర్భిణీ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లకు జన్మినిచ్చారు. తొలుత ఇద్దరు మగపిల్లలు, ఆ తర్వాత ఆడపిల్ల జన్మించింది. గతంలో ఇదే హాస్పిటల్ లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం అత్యంత అరుదని డాక్టర్లు తెలిపారు. ఒక్కోసారి నలుగురైదుగురు జన్మించిన సందర్భాలు కూడా ఉంటాయన్నారు.

  Nellore Woman gave birth to triplets doctors said mother and children are safe
  నెల్లూరు జిల్లా గూడురులో ఒకే కాన్పులో ముగ్గురు జననం(ఫైల్)

  ఇది చదవండి: భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆ భర్త ఏం చేశాడో తెలుసా...?  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు మూడు సార్లు చోటు చేసుకున్నాయి. గతేడాది డిసెంబర్ 18న కర్నూలు జిల్లాలో రమ్య అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. అలాగే అక్టోబర్ 25 దసరా రోజున తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడుకు చెందిన అడబాల శిరీష అనే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు మగశిసువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అలాగే తెలంగాణ నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం జాప్రాపూర్‌కు చెందిన హిమజ అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ మూడు ఘటనల్లో తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐతే చిత్తూరు జిల్లా కుప్పంలో మాత్రం అదురైదన కవలలే జన్మించారు. పట్టణంలోని కొత్తపేటకు చెందిన గోపి భార్య చంద్రకళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. సిజైరియన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీసిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు. సాధారణంగా కవలలు ఒకే పోలికలతో ఉంటారు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఒకరితో ఒకరికి పోలికే లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

  ఇది చదవండి: పోలవరంలో మరో కీలకఘట్టం... రికార్డుస్థాయిలో పనులు

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Chittoor, Telugu news

  ఉత్తమ కథలు